Sun 23 Jan 11:20:42.908223 2022 పాలకులు ఇప్పుడు నియంతల పాత్రలోముందు వెనకా చూడలేని మొండి ఆలోచనల్లోఎప్పుడు ఏ శాసనం యమ పాశం అవుతుందోచేయని తప్పులకు ప్రజలకు శిలువలుమానవీయ కోణం లేని కఠిన శాసనాలుమరణ మదంగం వాయిస్తూ మన పాలకులుపార్లమెంట్ పచ్చని పొలం లో కొచ్చిమూడు చట్టాలతో మంట పెట్టిందిగుండె కదిలిన రైతులు కాలిపోయారు ఎందరోఓట్ల జతరప్పుడు వొదిగి నమస్కారాలుపదవి కీక్కు పట్టాక పట్టవు విన్నపాలుసీతాకోకచిలుక లు తిరిగి గొంగడి పురుగు స్వరూపంGoలు వున్న పలంగా పట్టుకొచ్చిజీవితాల్ని చిందర వందర చేసిచెట్టుకు ఒకరు పుట్టకు ఒకరు కుటుంబం చెల్లా చెదురుచర్చ ఒకటి జరగాలి కదా ఇంటా బయటాబలవంతపు బిల్లులతో బలవన్మరణాలు దేశమంతాప్రజాస్వామ్యం పరువు తీస్తున్న పార్టీల క్రూర పోకడఢిల్లీ ఒక్కటే దూరం కాదుప్రగతి భవన్ కూడా పక్కకు రానీయడం లేదుప్రజల ప్రాణాల పోయే దాకా పాలకులు దిగి రావడం లేదునిలబడాలి నిరసన తెలపాలిబతకాలి బరితెగించి పోరాడాలికుర్చీని కదిలించి శాసనాలు తిరిగి రాయించాలి..- దాసరి మోహన్, 9985309080 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి