Sat 29 Jan 22:52:52.830792 2022 అవిశ్రాంతంగాఎంత దూరం పరుగెత్తానోఆ చివరొక విశ్రాంత గహముంటుందని! కను చూపు మేర నేనూ నింగీ నేలా తప్పా!సమూహాలనూఅనుచరులనూ నెట్టుకుంటూఇక్కడికొస్తే అయాసమొక్కటే సహచరి! ధ్యాసంతా గమ్యం పైనే ఒక్కొక్కరు వెనక బడ్డారనుకున్నా సర్దుకుంటున్నరు!మలుపు లాగేజీవితం చివరి వంపు తిరిగిందాఅందరూ ముఖం చాటేస్తారు! కల్పిత బంధాలకు వెలిగినంత సేపు కాంతి ఎక్కువే!జవసత్వాలుసూర్య చంద్రుల్లా వెలుగుతుంటేఈ ప్రపంచం ఎంత అందమైందో! ఆ చివర దారి మూసుకోనుంది విడువని గ్రహమొకటి కాచుకొని ఉంది!అవసరం కొద్దీఆడిన మాటల్లో అబద్ధాలుండొచ్చుఅలెగ్జాండర్లా చివర సత్యమే చెబుతున్న! జీవితంలో ఎన్నో ముద్దూ ముచ్చట్లు చవి చూశా మనుమ సిద్ధి పెట్టిన ముద్దే పదిలంగా!! - కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి