Sat 12 Feb 22:53:45.19689 2022 కండ్లు తెరిస్తే సమాధుల్లోంచి సూర్యుడు లేచి పలకరిత్తడు. సావుపుట్కల బతుకుమాధుర్యపు తత్వాల్ని మోసుకొస్తున్న గాలి చెంపల మీది నీటిబిందువుల్ని ఎత్తుకెళ్తుంది. ఇంటిముందరి ఒంటరి వేపచెట్టు వేర్లు పాతిపెట్టబడ్డ నా జాతి మూలవాసులతో ఎడతెగని వాదనలో మునిగి సమాధి స్థితిలోకి జారుకుంటయి.అదే పనిగా దేహం మీది తూట్లను లెక్కబెడుతుంటాడొకడు. నేలకు కన్నం చేసి కళ్లెర్రజేస్తూ ఊపిరిని ఊదుతుంటాడింకొకడు. ఒకడిది ఉన్మాదం. ఇంకొకడిది దినచర్య.పడిపోతున్న రాతిగోడల్ని నిలబెడుతుంటాను. పట్టుదప్పి ఒంటిని చిధ్రం చేసుకుంటాను. ఆకుపచ్చ నవ్వుతో వేపచెట్టు కన్నార్పకుండ చూస్తూ రోజూ నిట్టూరుస్తుంది.గాలి చొరబడని కొలిమి గదుల్లో సహజీవనం చేస్తున్న జనాల సాహసానికి నోరెళ్లబెడుతుంటాను.వెళ్తూవెళ్తూ కాసింత బూడిద నోట్లో వేస్తూ కాషాయం రెపరెపలాడుతుంటుంది. సమాధుల్లోంచి లేచిన విగ్రహాలు పూజలందుకుంటయి. ఏమీ కానట్టు.. ఇంకేమీ జరగనట్టు.. ఎవరూ ఏర్పాటుజేయనంత తేజస్సుతో మరో ఉదయం పలకరించి వెళ్తుంది. - బండారి రాజ్ కుమార్ ,9959914956 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి