కలిసి రండి కదలి రండి, కదం తొక్కి పదం పాడి, పొలం దున్నే రైతన్న కు సాయం చేద్దాం. ? కష్టమైనా, నష్టమైనా, దుక్కి దున్ని నారు పోసి, నీరు పెట్టి, పైరు పెంచి, బంగారం పండించే రైతన్నా! లోకానికి అన్నం పెట్టే రైతన్నా నీకు రాజసం ఎక్కడన్నా ! పంట పండినా గిట్టుబాటు ధర ఏదన్నా ! ? కరోనా కష్టకాలంలోను సాగు ఆపలేదు, సాయం ఆప లేదు. తన పది వ్రేళ్ళు మట్టిలో పెట్టి, మన ఐదు వ్రేళ్ళు నోటిలో పెట్టుకొనేలా చేశాడు! ఆయన ''వర్క్ ఫ్రమ్ ది హౌమ్'' చేయలేదు ''వర్క్ ఫర్ ది పీపుల్'' చేశాడు! అందుకే కలిసిరండి కదలిరండి వ్యవసాయానికి సాయం చేద్దాం ! రైతు మోములో చిరునవ్వు చూడాలని అన్న దాతకు వెన్ను దన్నుగా నిలవాలని, కదంతొక్కి, పదం పాడి కలిసి రండి.! పొలం దున్నే రైతన్నను రారాజును చేద్దాం. ! - డా|| సుధాకర్ రెడ్డి, 9989432353