Sat 19 Feb 23:15:12.760851 2022
Authorization
అతడు...
నడిగూడెం శనగసేల ఎర్రసెలకలమీంచి
పచ్చపచ్చగా పూసిన తంగేడు పూల గొడుగు కిందనుంచి
ఒకచేత్తో ముండ్లకర్రను త్రిశూలంలా పట్టుకొని
మరోచేత్తోడమరుకాన్ని
దిగంతాలు మారుమ్రోగేలా మోగిస్తూ...
నలుదిక్కుల్ని ఆలింగనం చేసుకొని
తన పాదముద్రలను తానే చేరిపేసుకొంటూ
విశ్వనగరంలో నాలుగోకన్నుతెరిచిన
ఆధునిక కవిత్వకాలభైరవుడు
సాహిత్య సభలల్లో అధ్యక్షుడైనా...
ఆవిష్కర్త స్థానములోఉన్నా...
మైకందుకుంటే చాలు పదాలతో పరుగులుపెట్టిస్తాడు
మాటలతో సభికుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాడు
కవిత్వం తనను ఆవహిస్తుందో
మరి తను కవిత్వాన్ని ఆవహిస్తాడో...
తెలియదుకాని
కలం చేతపడితే చాలు
దీర్ఘకవితల గంగాప్రవాహమే
ఇరువది మూడుదీర్ఘ కవితల్తో
ప్రపంచసాహిత్య చరిత్రపేజీల్లో అతిదీర్ఘ సంతకం చేసి
ప్రపంచరికార్డు కొట్టిన
మొట్టమొదటి మనఆధునిక తెలుగుకవనకషివలుడు
తెలంగాణా గుండె గోసను
మండు తున్న ప్రజల ఆక్రందనల్ని
మలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ముందే పసికట్టి
''నా తెలంగాణ'' అంటూ దీర్ఘకవితాశంఖాన్ని పూరించిన
అత్యాధునిక కవితా క్రాంతదర్శి
నాలుగొందలమంది కవుల కవిత్వహలాలతో
తెలంగాణా ఉద్యమ మాగాణాన్ని పొక్కిలి మొక్కలను
సాహిత్య భూమిలో మొలిపించిన కవికర్షకుడు
దళిత కవిత్వ జలపాతంలో దరిదొరకక
కొట్టుకుపోతున్న బి సి కవుల
కవిత్వప్రవాహాన్ని దారిమళ్లించి
తమ తాతతండ్రుల ఆత్మకథనాత్మక కవిత్వంతో
''వెంటాడే కలాల'' బి సి కవితా ప్రభంజనాన్ని
సష్టించిన వెనుకబడినకులాల కవితా పితామహుడు
బి సి వాద కవిత్వ ఉద్యమ ఆద్యుడు
సకల జనుల సమ్మెను
ఉద్యమ ఉదతిని వెవ్విపుటల్లో కుదించి
తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో
చేరిగిపోని రికార్డ్ చేసిన నవచరిత్రకారుడు.
తెలంగాణా రచయితల వేదికకు జవాజీవాలిచ్చి
లేలేత కలాలకు ఊతమిచ్చి
ఉద్యమ కవిత్వం రాయించి
ఉద్యవోన్ముఖుల్నిచేసిన సాహిత్యఉద్యమకారుడు
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ కొచ్చే
కోట్లాది మంది పుస్తక ప్రియుల జ్ఞాన దాహాన్ని తీరుస్తూ
కర్త కర్మక్రియా అన్ని తానై
ప్రతియేడు నవనవోన్మేశంగా నడిపిస్తున్న
జూలూరు చినబసవయ్య సక్కుబాయమ్మ
తొలిసూరు పుత్రుడు
- డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, 9440471423