తల్లి భూదేవికి పిల్లలంటే ప్రేమ మట్టిపై, నీటిలో జీవజాలమంతా తన పిల్లలే కడుపులో ముప్పావు కన్నీటి సముద్రాలున్నా ధైర్యంగా జీవనం, మంచి కోసమే మధనం అత్యాశ నిచ్చెనలు ఆకాశానికి వేయలే బాధల ఉప్పునీళ్లు తనలోనే దాచుకొని మంచి నీటి ఆవిరి చెంబు మబ్బులకు దానం త్యాగాల గొప్పదనం మరువని మబ్బులు భూమికి ప్రాణమివ్వడానికి ఆత్మార్పణం
భూమి గుండ్రంగా తిరుగుతుంది తన చుట్టూ, సూర్యచంద్రులకు దగ్గరగా చీకటి వెలుగులను అనుభవిస్తోంది సమానంగా నిశ్శబ్దంగా, నిమిత్తమాత్రురాలిగా
భూమంతా ఆక్రమించుకొని జీవ ప్రపంచం అత్యధిక జీవులకు ఉన్నదాంతో సంతప్తి తెలివి మీరిన మనిషిది పెత్తనం, పేరాశ పాలు తాగిన రొమ్ములపై గుద్దినట్లు తల్లి తలెంటికలు కొరిగినట్లు చేష్టలు
పచ్చదనం పరువు తీసి, బజార్లో అమ్మేసి గనుల కోసం అవనిని తొలచి పీనుగులా చేయడం పరితపించిన ప్రకతి కోపమొచ్చి శిగమోగితే చెప్పొచ్చిన ప్రళయం కొంత చెప్పి రాని వైరస్ విశ్వమంత వ్యాప్తి మనిషి చుట్టే దాడులపై దాడులు
తలకు బొప్పి కడితే బుద్ధొచ్చిన మనిషి పునరాలోచనలో ప్రపంచం ప్రయాణం ఎటువైపు ఆత్మవిమర్శ ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం మరిస్తే తుప్పు రేగ్గొట్టేలా తప్పుడు పనులు బుద్దొచ్చేదెప్పుడు , బుద్ధుడిలా మారేదెప్పుడు - కొమురవెల్లి అంజయ్య, 9848005676