నా కున్న ఆ రెండు కళ్ళు మా ఊరికున్న నీళ్ళ చెలిమెలు/ నా నుదుటి మీద మెరిసే బొట్టు అది మా ఊరిని ఆదుకునే జోగినాథుడనే ఆపద్భాందవు/ నా శిరస్సుపైన నిలిచిన శిఖరం అది మా ఊరి నడిబొడ్డున నిలబడిన మద్దిరంగం/ నా కున్న రెండు చేతులు అరచేతులను చాపే మా ఊరికి ఇరువైపుల ఉన్న మర్రిచెట్లు/ నా కున్న రెండు కాళ్లు మా ఊరి పిల్ల కాలువలకు నిజమైన ఆనవాళ్ళు/ నా మదిలో రూపుదిద్దుకున్న అందమైన చిత్రం/ అది మా ఊరి అద్దంలో మెరిసే నా ముఖచిత్రం!!