Sun 27 Mar 07:26:46.403386 2022 ఛిద్రమైనబతుకు దాహపు అడుగునెత్తురుమంచుబిందువులగులాభిరెమ్మలుమట్టిరేణువుశిలాజాలుకొన్ని కన్నీళ్లుపక్షిఈకలగౌను చిరిగిపోయిచితికి చెదిరిన లేత నవ్వుల పుప్పొడివిరిగి కుప్పకూలిన ఆర్తనాదాలుఅనేకానేక క్షణాలు పరుగుతీసి పరుగుతీసిఒరుగులైన నీడల గుర్తులుతడి నెత్తుట్లో కూరుకు పోయిమరణించినతెల్లరెక్కల సీతాకోకచిలుకలుఇక్కడొక జీర్ణాశయం నిండాఇనుపశకలపు ముద్దశిశిరపు చింత చెట్టు రాల్చిన ఆకుల్లానేలకప్పుకున్న అవయవాలుదుఃఖం బిగుసుకున్నతెగిపడిన గొంతుఅక్కడొకరొట్టెముక్కలో ఇరుక్కుపోయిన తూటాట్యాంకర్ల కింద ధ్వంసమవుతున్నచెమటచుక్కల ధ్వనిదుమ్ము పడుతున్న ఆఖరి శ్వాసప్రాణాలు కమురుతున్నమనిషి వాసనకాలంఅజీర్ణక్రియ బాధ పడుతోందిప్పుడు- వడ్డెబోయిన శ్రీనివాస్ 9885756071 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి