Sun 10 Apr 00:12:31.134547 2022
Authorization
1. కొన్ని సమయాలు ఏమీ బాగుండవు !
2. రేపటి మీది ఆశతోనే
ప్రతి రాత్రికీ వీడ్కోలు పలుకుతాను
ఇప్పటిదాకా ఇసుర్రాయి కింద నలిగిన సమయాలన్నీ
ఏ జ్ఞాపకాన్నీ రాల్చలేకపోయాక
క్రితందాకా తర్జనభర్జన పడ్డ క్షణాలన్నీ
ఏ చిరునవ్వునూ పూయించ లేకపోయాక
గుర్తుపెట్టుకోదగ్గ ఒక్క నిమిషాన్ని అయినా
ఒడిసి పట్టని దేహాన్ని
ఇక తప్పదన్నట్టుగా తప్పనిసరిగా
అయిష్టంగానే మంచంపై పారేస్తాను !
అనిద్రలో అతి జాగ్రత్తగా అజాగతంగా మేలుకొని నిద్రిస్తాను!
3. దినం-
ఓ పేరుకుపోయిన అంట్ల గిన్నె !
చక్కగా తోమి శుభ్రంగా కడిగేసి
కాలం తనబ్బీ లో దాచిపెట్టి
కనీసం రేపటికి అయినా
అనుభవాల పొయ్యిపై
జ్ఞాపకం పెట్టుకోదగ్గ క్షణాల మెతుకులను
ఉడికిస్తుందని ఆశపడతాను!
దినం-
దుమ్ము కొట్టుకుపోయిన వాకిలి !
చక్కగా ఊడ్చేసి అలికి ముగ్గులు వేసి
చెప్పకుండా వచ్చే అతిధి కోసం
చూపులను దర్వాజా మీద తోరణంలా కడతాను !
4. కానీ కొన్ని సమయాలు నిర్దయలుు
నాలుగు కళ్ళ ఎదురుచూపుల లోతు
నాలుగు చేతుల పెనవేతల గాఢత
నాలుగు పెదాల నిరీక్షిత లాలస
రెండు నడుముల విరహ తీవ్రత
నాలుగుకాళ్ల వియోగ విహ్వలత
రెండు మనసుల అవిశ్రాంత వలపోత
వందలాది ఉఛ్వాస నిశ్వాసల ఉత్కంఠ
వాటికి ఎంతకీ అర్థం కావేమో .....!?
5. కొన్ని సమయాలు నిరర్ధకాలుు
సఱష్ఱశీఅaతీyలోని పదాలు అన్నింటినీ వల్లె వేసినా
ఒక్క కొత్త పదమూ పుట్టదు
గుర్తుంచుకోదగ్గ ఒక్క వాక్యమూ బోర్డు మీదకి ఎక్కదు !
6. కొన్ని సమయాలు నిష్ప్రయోజకాలుు
రోజంతా లోకం చుట్టూతా తిరిగినా
ఒక్క అడుగూ చెరిగిపోని ముద్ర వేయదు
రవ్ జూతీశీజూవత్ీy లాగా అలా నిశ్చలంగా ఉండిపోతాయి
భారంగా కరుగుతూ ు దీనంగా చెరుగుతూ
తీవ్ర విరక్తిని, ఘోర నిర్లిప్తతని,
అనాయాస అనాసక్తిని అందించి
షaశ్రీవఅసaతీ లో కేవలం సa్వ మార్చడం లాగానే మిగులుతాయి !
7. కొన్ని సమయాలు ఝసఱర్లు-
వాటికి సంకల్పాలను సమాధి చేయడం
ఆశల పూలను తుంచివేయడం
ఆకాంక్షల మొగ్గలను చిదిమి వేయడం
ఉత్తుంగ ఉత్సాహాలను అణచివేయడం
అందంగా రాసిన రాతలను -
అపురూపంగా గీసిన చిత్రాలను చెరిపివేయడం
అహౌరాత్రులు శ్రమించి
చెక్కిన శిల్పాన్ని ముక్కలు చేయడం మాత్రమే తెలుసు !
8. అందుకే ఒక బహిష్కత మానవుడెవడో
గొంతు చించుకుని అరుస్తుంటాడుు
''కొన్ని సమయాలు అస్సలు బాగుండవు
కొన్ని సమయాలు అసలే బాగుండవు''
9. ఇదంతా చూస్తున్న కాలం
ఒక్కసారి దిగ్గున లేచి ఇలా అందిు
'ఒరేరు మానవా! నువ్వొక నిజాన్ని తెలుసుకోవాలి
యుగాల నుంచి సమయాలు ఒకేలా ఉన్నాయి
కానీ నువ్వు ప్రేమించిన మనుషుల వల్ల మాత్రమే
ఆ సమయాలు నీకు
దయాపూరితంగా అర్ధవంతంగా
ప్రయోజనాత్మకంగా - మధుర స్మతులుగా దర్శనమిస్తున్నాయి !''
10. అవును కదా,
మరి ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు ??
- మామిడి హరికృష్ణ, 8008005231
కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి
సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ