Sat 16 Apr 23:38:52.016844 2022 నెలవంక రాతిరి నిదురను దోచింది కనురెప్పల పాట మనసును తాకింది !నడిరేయి జాములోకొలిక్కి రాని వాక్యాలుపురిటి నొప్పుల్లోసంధి కొడుతున్న భావాలు !పీడ కలగన్న ఏ పిట్టోపల్లవి లేని పాట ఆలపించిందిఆద మరచీ నిదురోనిగుండె సడి లయ తప్పింది !తెలియని మత్తు ఏదోమగతై రెప్పలపై వాలిందికదిలీ కదలని కలంఅసంపూర్ణ కవితను మిగిల్చింది !ఇక ఏ వేకువ వెన్నెలోచీకటి రాత్రులను చిదిమితూరపు ఆకాశాన ఇనబింబమైసంపూర్ణ కవితను చిత్రించాలి !- సురేంద్ర రొడ్డ, 9491523570 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి