Sun 01 May 23:17:11.207834 2022 ఉదయించే సూర్యుడుఉష్ణ రక్తకాసారంలో మండుతున్న గుండెగురిచూసి వదులుతున్న బాణపు దిశఅతనెప్పుడూ తూరుపుదిక్కేప్రశ్నించే గొంతుకనిట్టనిలువునా చీలే నియంతృత్వంనివురుగప్పిన జ్వలించే నిజంవాడెప్పుడూ దక్షిణంవైపేఊబిలో కూరుకుపోతున్న వాగ్దానంఉరికంబం ఎక్కిస్తున్న ఆశల జలతారుగారడి ఆటలో కనికట్టును తాకట్టుపెట్టిన విన్యాసంవీడిదెప్పుడూ పడమటి చూపేఊకదంపుడు ఉపన్యాసాల్లో రాలుతున్న ఊకఊరడించే మలాం పూతలుపువ్వులోని మకరందాన్ని తాగే భ్రమరంఇతనిదెప్పుడూ దక్షిణం గోలేదిక్కులు పిక్కటిల్లే ఆకలి అరుపులు వెలుగు చీకటుల మధ్య వ్రేలాడుతున్న బతుకులు మంచు చినుకుల కింద కూరుకుపోతున్న కళేబరాలుదిక్కులనన్నీ ఏకం చేస్తున్న ఏక్ సితారా రాగంరగులుతున్న నిప్పుల కుంపటిలోంచివెలిగిస్తున్న పోరాటదీపం - కోడం పవన్‌కుమార్, 9848992825 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి