Sat 14 May 23:04:50.481394 2022 అహంకారానికి, ఆత్మ గౌరవానికి నడుమ ఓ యుద్ధం జరుగుతోంది,ఆధిపత్యానికో,అది ఏ పైత్యానికో,అర్థం కాని లోకం ఆద్యంతం చోద్యంగా వీక్షిస్తోంది, గగన తలాన మత్యు లోహ విహం ''గద్దలు'' ఎగరడం చూసి,బంకర్లో దాగిన ఓ తల్లికోడి, పిల్లలతో సహా బిక్కుబిక్కుమంటూ కాలాన్ని పొడుచుకు తింటోంది,వేల తూటాలు పేలి,వందల శవాలు రాలి...నేడో, రేపో యుద్ధమైతే ముగుస్తుంది....కానీ ఆ తర్వాత....??రుధిరమంటిన రహదారులు, పతనమైన పాత గోడలు,శిథిలమైన నగరాలు, నలుదిక్కులా ఆర్తనాదాలు,నిజం చెప్పు....ఇదే కదా యుద్ధమంటే....?!స్మశానాల ఆకలి తీర్చడానికి అమాయకులనుబలివ్వడమే కదా యుద్ధమంటే....?!రెపరెపలాడే శ్వేత పతాకానికై,రెక్కలు విప్పే శాంతి కపోతానికై,వేచి చూసి, అలసి సొమ్మసిల్లిన ఓ ముసలి కళ్ళ అంచుల్లో ఎప్పుడో చిక్కుకున్నఓ అశ్రు బిందువు నేలరాలుతుంది....యుద్ధమంటే సరదా పడి,చివరికి ఏమీ సాధించలేకరక్తమంటిన రిక్త హస్తాలతో,తెగిపడ్డ తలలు, చలనం లేని దేహాల సాక్షిగాకరచాలనం చేస్తూ....''రణ''రంగస్థలపు నాటకాన్ని రక్తి కట్టిస్తారు చివరికి ''ఆ ఇద్దరు....''- జాబేర్.పాషా, 00968 78531638 మస్కట్ (ఒమన్) టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి