Sun 15 May 23:02:20.390047 2022 పల్లెకు కాళ్ళుండవుమన దగ్గరకు నడచి రావడానికిదానికి మనసుంటదిమన కోసం ఎదురు చూస్తుంటుంది!కారణం ఏదైనా కానిపండగో పబ్బమోజాతరో తీరని యాతనోఅప్పుడప్పుడు ఊరెళ్ళి వస్తుండాలి!అది ఇప్పుడుచివికిన గూడే కావచ్చుఊరెళ్ళి వచ్చినప్పుడల్లామన వయో భారం కొంత మాయమవుతుంది!అన్నీ మరచిఒక మై మరుపుతో ఊరంతా తిరుగాడుతుంటేఎదిగిన మన పాదాలను చూసిచిన్న నాటి పాద ముద్రలు మురిసి పోతాయి!ఎన్ని భవనాలుఎక్కి దిగినాపుట్టిన నేల మీద పాదం మోపినప్పుడల్లామనకు కలిగే ఆ పులకరింతే వేరు!తప్పులు చేసినప్పుడల్లాసాచిన చేతులకు సాక్ష్యంశిథిలమైన మా పాఠశాల వరండానా రాకను పసిగట్టి మురిసిపోతది!కొట్టీ కొట్టీ అలసిపోయినఅటెండర్ కాశీం గుండె ఆగిపోయిందిప్రార్థనా కాలం బడి గంటల ప్రతి ధ్వనిఇంకా వెంటాడుతూనే ఉంది!అమ్మ లేదు నాన్న లేడుఅయినా ఊరక్కడే ఉందివారి జ్ఞాపకాలను పదిలంగాదాచి పెట్టిన సందూక పెట్టెలా!ఊరు నిండా నా జ్ఞాపకాలునా ఎద నిండా ఊరు తలపులుబుద్ధి పుట్టినప్పుడల్లాఅదీ నేనూ నెమరేసుకుంటూ ఉంటాం!!- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి