Sun 22 May 22:40:58.285464 2022 నిదురనోమెలకువనో అర్థంకాని ఊగిసలాటగా కలవరపెడుతూనెకళ్ళ ఆకురాళ్ళపైకత్తులు నూరుతుందిరాత్రిఒక్కుమ్మడిగాతలలోకి చొరబడినకురులన్నీగజిబిజిగాఅల్లుకుపోతాయి.విడదీయరాని చిక్కు.. చిరాకు..చిత్రవిచిత్రమైన ఊహలు,ఆలోచనలు,జ్ఞాపకాలు, కలలు, కల్లలుచిక్కని చీకట్లోఆ చిక్కుల సాలెగూడులోవిడదీస్తున్నాననుకునే భ్రమలోఇరుక్కు పోతుంది మనసు.అదో... కళ్ళులేని నల్లతుమ్మెద.ఆడని రెక్కలతోఅటూ ఇటూ కొట్టుకునిఏమీ చేయలేకఎటూ కదల లేకఅలసి సొలసిమత్తిల్లి పడిపోతుంది.అప్పుడువచ్చి వాలుతుంది నిదురఏమి చెప్పకుండానేకనీసం ఏ సంకేతమూ లేకుండానేఒక నడిరాతిరికనురెప్పలకు హాయిజిగురు అలదినట్లుగా...!- మడిపల్లి రాజ్‌కుమార్ 9949699215 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి