Sat 28 May 23:14:31.088344 2022 నిన్నెందుకో అతడు రాలేదునల్లమబ్బు ఒంపే చీకటికిరవికిరణపు మెరుపుకునడుమ జరిగేసంభాషణల సందిగ్ధతల మధ్యననింగి నలుగుతోందిఎండిన దేహంతో అల్లాడుతున్న నేలమేఘం ఒంపే క్షీరధారలకైఆవురావురంటోందిపూలమొక్కలు తలలు వంచుకునిమౌనంగా వాన కలను మోస్తున్నాయి మొదలులోకి ఒలికిన నీటినిఎంత చప్పరించినాచినుకుచేతుల కౌగిలింతంటేవాటికెంత ఇష్టమోనడివేసవి రోజునఎర్రని ముఖంతోనవ్వుతూనే వేడెక్కించే సూర్యుడు రాలేదనుకున్నానుబహుశాక్రమం తప్పకుండా డ్యూటీ చేసిఅలసిన కార్మికుడిలావిశ్రాంతికి తపిస్తున్నాడేమో అనుకున్నానుబద్ధకపు చిరునామా ఎరుగని అతడుఈ రోజు ఉదయాన్నేరెట్టింపు ఉత్సాహంతోత్వరగా తయారై వచ్చాడుభగభగలతో ముచ్చెమటలు పట్టిస్తూనిట్టూర్పు చితుకులు రాజేసినిలువెల్లా మంటలు రేపుతున్నాడు-పద్మావతి రాంభక్త 9966307777 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి