Sat 28 May 23:14:34.034423 2022
Authorization
వజ్రోత్సవ స్వతంత్ర భారతి
వందల దేశాల మధ్య
ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని
ఆకాశంనిండా ఎగరేస్తుంటే..,
అంత గొప్ప రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్...
మన నేతని..,రొమ్ము విరుచుకోకపోగ...,
పచ్చని ఆ సీమలో అగ్గిపుట్టిస్తర..,
చల్లని ఆ గోదారికూడ ఆర్పలేని
మంటలు పెడుతర..,
వేలఏండ్లు వెనక్కుపోయి..
నోటెంట... ఆ మహనీయుని
మాట పలుకొద్దనుకుంటరా.!?
రోడ్లనడుమ ఆమూర్తిని నిలుపుకుంటెనే...,
జయంతి వర్ధంతులు జరుపుకుంటుంటెనే...,
కార్యాలయాల చిత్తరువులు
నిలుపుకుంటెనే...,
రోజూ పోరాటం చేస్తుంటెనే..,
ఇంత రాద్ధాంతం చేస్తుంటే..
అమ్మో.....
నీలాకాశాన్నిసైతం
మసిపూసిన మబ్బుల్తో
మూసేటట్టుందీ లోకం.
మనమంతా ఒక్కటని...,
జై భీమన్న అన్న ఆ నేస్తాలేరి!?
రంగురంగుల జెండాలెగురెయ్యరేం!?
ఇదేం? అని అడగరేం!?
యాభైఏళ్ళు దాటినా...ఏందీ
దాచిపెట్టుడు అనుకుంటున్నారేమో...
ఆయన కన్నీళ్ళకు కండలు పెరిగినట్లయితే...
ఊరగ్గి అయ్యేదా...!?
మంటలు గాలిమళ్ళక పోయుండేవా!?
రాజ్యాలో.... రాజకీయాలో...
పచ్చగడ్డిని సైతం ముట్టిస్తున్నరు.
కోనసీమసైతం... కొండెత్తు మంటల మూటకట్టుకుంది!
కలికాలం....
కాలమంతా మొక్కాల్సిన దేవుళ్ళగూళ్ళు కూలిపోతున్నరు....
దేవుళ్ళపటాలుకూడా కాలిపోతున్నరు!
మనుషుల మనసులు పొగసూరుతున్నరు.
- అనుముల ప్రభాకరాచారి
9676549963