పారదర్శకత ప్రవేశించిందంటారు మానవ సూచీ అంకెల మీద అప్పుడప్పుడు పరిమళమద్ది చూపెడుతుంటారు వాహక సూచీలెన్ని రూపాలెత్తినా వ్యూహకర్తను బట్టే ప్రదర్శన ఉంటుంది అంతా అరచేతిలోకి ఒదిగి పోయిందని మెరుపుల తెరమీద మౌజ్ను తిప్పేస్తుంటారు
అన్నీ వెతికి తీసిన నిజాలే అంతా అరబోసిన ముత్యాల యవనికలే
ఒక్క కన్నూ మొత్తం దశ్యాన్ని చూడగలిగేదే అయినా రెండున్నాయి, ఇంకోటి కూడా చూడమని
మూడో కంటి అబద్దం రెండో దాంట్లో దూరాక ఆకలి, అదే దైన్యం తో ఒకవైపు దోపిడి, ముసుగేది అక్కర లేకుండా మరోవైపు