Mon 27 Jun 04:38:10.094341 2022 పొద్దున్నే నా నిదురమోముమా పెరట్లోనిస్పైడర్ గూట్లో చిక్కుకుందిఈ అనూహ్య అసహనస్పర్షానుభూతికిఅసంకల్పిత ప్రతీకార చర్యగూడు చెదిరిపోవడం నా వల్లే..!!అహోరాత్రులూ అల్లుకున్నవన్నె చిన్నెలవెన్నెల పోగుల విధ్వంసంనా ఏమరుపాటు వల్లే..!!ఇంద్రధనువు వర్ణాలనుమేళవించుకొనిజిలుగు జిగురు పోగులనుతనలోంచి తోడుకుంటూరేఖాగణితపు కొలతలతోవ్యూహాత్మకంగాఅల్లుకున్న మహేంద్రజాలంఒక్క కుదుపుకి అస్తవ్యస్థంనా వల్లే..!జాలి గూడల్లుతూ..అల్లుతూఎన్నిసార్లు జారి పడిందో.!అన్నిమార్లూ పునర్భలంతో ఎగబాకుడేతలచినది జరుగనిదే తలపెట్టినది పూరించనిదేపట్టు వదలని నైజం ఈ అష్టాపాది వైనం..!అనన్య ప్రతిభా.. ఆకట్టుకునే నైపుణ్యంఎవరు నేర్పారో..ఇంకెవరూ సాటిరారీలోకాన ఆ అల్లికల వలకిఅన్నట్టు..తనను తాను బతికించుకునేందుకేమెత్తగా మత్తుగావెన్నెల దుప్పటి నేసివశీకరించుకుంటుంది వెర్రి జీవులనిమనమేచీదరించుకొని చెరిపేస్తాంజీవకారుణ్యం కరువైన మానవులం .ఎవరి జీవన శైలీ వారిదే,ఎవరి జీవితం వారిదే..జీవించే హక్కు నీదీ నాదీ అందరిదీనూగడ్డిని మేకా..మేకని పులీ,పులిని ఇంకోటి..ఇంకోదాన్ని మరోటిఆహారపు గొలుసు సహజమే కదా..!కన్నూ మిన్నూ కానకకదిలిపోయే నేనేఇవ్వాలిప్పుడు కాంపెన్సెషన్..!!- నాంపల్లి సుజాత 9848059893 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి