Mon 27 Jun 04:38:11.950996 2022 ఏ ఊహలు మోసిందో మయూరమై నా హదయం!!సిరివెన్నెల కాసిందే అమాసలో నా నయనం!!లేఖలెన్ని రాసిందో నీ మనసును దోచేందుకువలపు దీక్ష పూనిందే వయారమై నా పరువం!!స్వరములెన్ని దాచిందో అనురాగం పాడేందుకువేణువెంత వగచిందో పలకలేక నా రాగం!!కలల పాన్పు ఎక్కలేదు పగటి భ్రాంతి తీరలేదుఏ స్వప్నం ముసిరిందో కలవరమై నా దేహం!!తపములెన్ని చేసిందో ఓ సత్యా!! నీ మౌనం!అరమోడ్పు కన్నుల్లో అర్థమవదు ఏ భావం!!- ఆర్.ఎస్.ఎస్.లక్ష్మి సత్య స్వరాళి, 8790700383 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి