ఎదను ఆర్ద్రం చేసుకుని పాడడం నాకిష్టం కాలిన గాయాల జీవితగేయాలను పాడటమంటే మరీ మరీ ఇష్టం!!
నా పాటని.. అక్కున చేర్చుకునే చేతులు కొన్ని ఆశీర్వదించే చేతులు మరికొన్ని ఆలింగనమై హత్తుకునే హృదయాలు ఇంకొన్ని
పాటకి పల్లవై కొందరు చరణమై ఇంకొందరు నన్ను.. నా పాటని.. పాదాలకు అడుగులుగా తొడుక్కుని ఆలోచనా పథాలై నడుస్తున్న వాళ్ళని చూసి పాటగూటిలో మరిన్ని పాటలకు పురుడుపోస్తుంటాను!