Sat 02 Jul 23:57:35.911921 2022 ఎందుకో ఈ కవిత్వంశాలువాలకు బిరుదులకుసన్మానాలకు చిక్కనంటదిగూడాలు తండాలుపల్లెలు అడవులుకాలికి కలం కట్టుకొనితిరిగొస్తానంటదిపక్షులని పచ్చనీ చెట్లనిచెరువులు నదులుసముద్రాలు నక్షత్రాలనుపాట పాడమని అడుగుతదిమసీద్ గుడి చర్చి దగ్గరబిచ్చగాళ్ళతో....దేవుణ్ణి మీలో ఎవరైనా చూశారా?!చూస్తే.... నాకు కూడా చూపించమంటది!!కార్మికులు కర్షకులువిద్యార్థులు నిరుద్యోగులుపిడికిళ్ళు బిగించడం ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారంటదిఇప్పుడో కొత్త ఫ్యాక్టరీనిర్మించాల్సిన అవసరమంటదిమనుషులను తయారు చేసేందుకుమానవతా జెండా ఎగరేసేందుకుఎందుకో ఈ కవిత్వంబిరుదులకు శాలువాలకు పదువులకు కులమతాలకు చిక్కనంటదిఉద్యమాల వెంట నడుస్తానంటది కదులుతాను కదిలిస్తానంటదిఅసలు ఎప్పటికీ ఎవరికీ చిక్కనంటదిఎందుకో ఈ కవిత్వంఎర్రనీ మంటై నిత్యం మండుతూనే ఉంటది- రౌతు రవి టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి