Wed 06 Jul 03:24:13.355575 2022 పోగొట్టుకోడానికి ఏం మిగిలిందనికదిలే జీవంలేని కట్టెతప్పకాళ్ళకిందపిడికెడుమట్టైనా మిగలనివాళ్ళుతేనెతుట్టెనులేపిబతుకుల్ని బజారు పాలుచేసినట్టుఎంతకని వెంటాడివేటాడి మంటల్లో బొర్లిస్తరురాలడానికివొంట్లో చుక్కరక్తం లేనివాళ్ళుఎప్పుడో టీఎమ్సీలలెక్కనజలాశయాల్ని నింపినవాళ్ళుపొద్దంతా పునికినాపెయ్యిమీద బొమికలు తగలనివాళ్ళుఏనాడో నుసిచేసిఅన్నం మెతుకుల్లామీ ఇంటిల్లిపాది పళ్లాల్లోకినడిసొచ్చినవాళ్ళుఊరేగింపుల్లో ముందుండితలకెత్తుకుని పీఠందాకామోసుకుపోయినవాళ్ళుకోల్పోయింది కొండంతరాల్చింది ఆవగింజంతనిర్వాసితులంటేనేలను కోల్పోయిన వాళ్ళేకాదుదొంగ రాత్రి పొంగిన వరదకుసర్వస్వం తుడిచిపెట్టుకుపోయినవాళ్ళుదీపం మలిపేసిచూపును చెరపట్టవచ్చుగూడును చెదరగొట్టిగుంపును బెదిరించవచ్చుకానీ రేపు కడుపు మసిలిన ఊర్లన్నీగుండె చెదరని గుడాటిపల్లివెనకే....- కొండి మల్లారెడ్డి, 9652199182 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి