Mon 18 Jul 02:54:20.414049 2022 నువ్వు చేరక మునుపే శూన్య గదిలో విస్తరించిన గాలివాటంలానీ సంగతులన్నీ చెవులు కొరుక్కుంటూ అల్ప పీడన మబ్బులైపోతారు..!నిజా నిజాల్ని తేల్చుకోవటానికిఅసహజ నవ్వుల్ని పూయిస్తూముతక వాసన వేస్తున్న చూపులతోతడి పొడి మాటల్ని ప్రారంభిస్తారు..!కొంత దూరం ప్రయాణించాకనిప్పులు నిగ్గు తేలే భావాన్నిసత్యస్పందిత గీటురాయిపై పరీక్షించిఒకింత సానుభూతిగా వికసిస్తారు..!ఇంకా శేషప్రశ్నలా తేరిపార చూసికొందరు ముందు నుండి దాటిపోతే చిన్నగా వర్షించిన లోగిలికి కల్లాపిజల్లిమరికొందరు వెన్నంటి చేరుతారు..!కొందరు కుడివైపుగా కదిలిమరికొందరు ఎడమవైపుగా కదిలినీపై ఎక్కుపెట్టిన నిందలకైభిన్న ధవాలుగా మారి నీకై తలబడుతారు..!!- డా. వాసాల వరప్రసాద్ 9490189847 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి