Mon 18 Jul 02:54:24.798511 2022 నింగిని చీల్చుకుంటూ వచ్చిభూమిని తాకే మేఘపు పులకరింత !భగ భగ వేసవికి సెలవిచ్చిశీతలశీకర పలకరింత! నింగికి నేలకు మధ్య ప్రేమ ప్రసార భాషణంపు ముద్దుల వర్షంలో! లేగదూడను ఆవు నాకేవాత్సల్య దశ్యావిష్కరణ! చెట్టును పలకరించిరాయిని చిలకరించి ఎగసి మిడిసి పడుతూ నదిని తట్టిలేపే ఉద్యమ పద్యం!చేను చెలకలకు అనుకోని అతిథి ప్రకతి మాత ఉమ్మనీటి నుండి పంటల ప్రసూతి ! వాగు వంకల, సెలయేరులలోకప్పల గాన కచేరీ చేపల నత్య విభావరి కాగితపు పడవల వయ్యారపు పోటీలు వర్ష వార్షికోత్సవాలు వానకళావల్లభుని హర్షాతిరేకాలు!నిరాశ్రయుల కన్నీటి జలపాతాలు తానై తరలి వచ్చిన గంగమ్మ చిద్విలాసాలు పునరావాస కేంద్రాల చుట్టూ వాలిన గూడు తెగిన పక్షులపొట్ట కూటి పలవరింతలు తాగు నీటి కలవరింతలువర్షం ఒక సందేశ వారధి మట్టి గంధంతో మనిషి సౌందర్యం చేసిన పరుసవేది వర్షం ఒక గీటురాయి మనిషి చేష్టల వికతపోకడల నిగ్గుతేల్చే ఆకు రాయి వర్షం ఒక సంకేతం రాబోయే సంతోషానికోవిషాదానికో రహస్య సందేశం మోసుకొచ్చేకపోతం వర్షం ఒక రుజువు! తాను చేసిన పచ్చని హత్యలకుమనిషి ఎదుర్కునేపర్యవసానపు హెచ్చరికల దరువు - కె ఎస్ అనంతాచార్య 9441195765 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి