Sun 07 Aug 02:49:27.811573 2022 జీవితాన్ని అనుభూతుల పూలతోట చేసినావుకణకణమున చెలిమిపూల పుప్పొడినే నింపినావుకులమన్నది మతమన్నది బంధాలకు సంకెలనేఅడ్డుగోడ కూలదోసి స్నేహగీతి పాడినావుచెలిమెల్లో నీళ్ళుదాగి చెట్టక్కిన చిలిపిచేష్టచెదిరిపోని జ్ఞాపకాల కావ్యాన్నే రాసినావునాగుండెకు గాయమైన నీ కన్నులు తడిసిపోయెదేహాలే వేరుగాని ఒక శ్వాసగ మారినావుబంధాలే ఆర్థిక అనుబంధాలుగ మారుతుంటెనిస్వార్థపు మైత్రి నాకు కానుకగా ఇచ్చినావురహస్యాల గూఢచారి స్నేహితుడే లోకంలోభూగోళం బద్దలైన లోలోపల దాచినావుఅవసరాల స్నేహాలే చీకటిలా వ్యాపించెనుఓ చంద్రుడ! స్వచ్ఛమైన వెన్నెలవై కురిసినావు!!- వెన్నెల సత్యం టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి