Sun 14 Aug 00:56:19.82165 2022 కాలం చరిస్తునే వుంటుందిఒక్కోసారి నత్తలా నడుస్తూమరోసారి చిరుతలా దొర్లుతూ పరిగెడుతూ.జీవితం తరిస్తుంటుందిఒక్కోసారి ఖేదంతో ఏడుస్తూమరోసారి మోదంగా నవ్వుతూ.కాలం తుది తెలియని వాహికజీవితం ఎడతెగని దప్పిక.కాలం నిత్యచలనశీలిఅయినాస్థితప్రజ్ఞ దాని లక్షణం.అసంగతి తెలియకుండాజీవితం కూడాతనతో పోటీ పడుతుంది.నిజానికికాలచక్రం, జీవితవలయంఅద్వైతానికి ప్రతీకలు.జీవితమంటేకాలనదికి ఒక పాయ,కాలమంటేజీవన ప్రకాశానికి ఒక ఛాయ.- కుడికాల వంశీధర్, 9885201600 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి