Sun 21 Aug 01:31:56.716056 2022 జీవితమంటే సగం వాక్యమేరాలడానికే ఈ రాకఊహాజనిత భ్రమల్లోబతుకును తీపిగా వాంఛిస్తున్నాంమత్యునిదుర ముందుమన చీమలబార్లుఉల్లాసంగా తిరుగుతుంటాయితను కళ్ళు తెరిస్తేకుప్పిగంతులు దూళి రేణువుగాకొట్టుకపోవాల్సిందేఈ మోహం దాహం మజిలీలలోజోలె ఎంతకూ నిండదుపిడికెడు కబలం పైమమకారం పెంచుకోవాలేకానీపుత్తడిపై ఆశ కాదుఅక్కడికీ బైరాగులుచెబుతూనే ఉన్నారుకట్టెకు అలంకరణలు ఉట్టివే అనిఅశాశ్వత కలలువడలిన పత్రాలుదీర్ఘ కాలం మనలేవుజీర్ణమయ్యే జన్మలుఅద్దంలో కనిపించవుచూపు శబ్దం పరిధి దాటితాత్విక మౌనంతో గ్రహించినపుడురాకపోకల ఆంతర్యాలుమార్మికమని తెలుసుకుంటావుచితిలో చిరునామచెరుపుకున్న తరువాతనీ సంతకం పిడికెడు బూడిద .- తెలుగు వెంకటేష్, 9985325362 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి