Sat 01 Oct 23:40:03.950585 2022 పల్లె పచ్చగ వెల్లివిరిసి.. నవ్వుతుంటే చీకటెక్కడీబడుగు బ్రతుకుల.. ప్రగతి కోరే మనసు వుంటే చీకటెక్కడీచేతివత్తులు చేవ పుంజుకు.. ఆధునికతకు చేరువాయెనుపట్టుగొమ్మలు ఛాతి విరుస్తు..నడుస్తుంటే చీకటెక్కడీగడప గడపకు సరస్వతమ్మ..స్నేహ హస్తము చాచి నిలచెనువెట్టి వెతలకు గట్టి జ్ఞానము.. దొరుకుతుంటే చీకటెక్కడీనల్లమబ్బులు చిందులేస్తూ..నేలమ్మతో కలిసి నడిచెనుతనివితీరా చేను చెలకను..హత్తుకుంటే చీకటెక్కడీభూతదయతో ప్రజానీకము..హదయాంజలి సమర్పించిరికాలుష్యమే తోకముడిచీ.. ఉరుకుతుంటే చీకటెక్కడీఒకే గొంతుక,ఒకే భావము..రంగు వెలుస్తూ చిన్నబోయెనునిజం తెలుసుకు నరుడు నరుడై.. బతుకుతుంటే చీకటెక్కడీపూనకాలకు, జంతుబలులకు.. వంగి వంగీ వందనాలేజనుల మదిలో మూఢపుపొరలు..తొలగుతుంటే చీకటెక్కడీ(గతి : మిశ్రగతి)- సోంపాక సీత, 8639311050 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి