Sun 09 Oct 02:11:40.114354 2022
Authorization
ఇక మా ఊర్లో దసరా పండుగ భలే సరదాగా సాగుతుంది. దేవుళ్ల రథాలు వివిధ బస్తీల నుండి ఊరేగింపుగా వచ్చి ఒకే ప్రాంగణానికి చేరుతాయి. దీపాలు, రంగురంగుల అలంకరణలు, ఒక నెల రోజుల ముందు నుండే ఏదో ఒక దేవుని కాన్సెప్ట్ తీసుకుని ఈ షావాలను సిద్ధం చేస్తారు. ఎవరి బస్తీ షావా బాగుందో చూసి ఎంపిక కమిటి బహుమతులూ ఇస్తుంది. జమ్మి పూజలూ, అదే ప్రాంతంలో జరుగుతాయి. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరతారు. పెద్ద జన సందోహంతో ఊరు ఊరంతా ఉత్సవంలా మారుతుంది. మిత్రులు, పరిచయమున్న అందరూ అక్కడ కలుసుకుని జమ్మి పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేను చిన్నప్పటి నుండీ ఈ సరదాను చూస్తూనే వున్నాను. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అధికార పార్టీ ప్రచార కేంద్రంగా కూడా ఇది మారింది. ఒక వేదిక ఏర్పాటు చేసి రాజకీయ ఉపన్యాసాలు, ప్రజాప్రతినిధుల హడావిడి పెరిగింది.
పండుగల సందర్భంగా చాలా మంది పనిచేస్తున్న పట్టణాల నుండి సొంతూరుకు వెళ్లి వస్తారు. ఇది సాధారణ విషయమే. నేనూ హైదరాబాదు నుండి మా పుట్టినూరుకు వచ్చాను. బొగ్గుట్టగా పేరొందిన ఇల్లందు అది. ఇప్పుడు దీన్నీ పట్టణమనే అంటారు. పల్లెకూ పట్నానికి మధ్య రకంగా వుంటుంది. చాలా ప్రాచీనమైనదే ఊరు. ప్రతి ఊరికి ఓ చరిత్ర ఉన్నట్లే ఈ ఊరికీ ఘనమైన చరిత్రే వుంది. ఆ వివరాలు మరోసారి చెప్పుకుందాం. ఊర్లోకి వెళ్లగానే బయట ఆడీ ఆడీ అమ్మవొడిలోకి వెళ్లినంత స్వాంతన ఎప్పుడూ కలిగినట్లుగానే ఈ సారీ అంతే ఫీలింగ్. దానికి ఇంకా బలమైన కారణం అమ్మ కూడా అక్కడే వుంది. మేమొస్తామనే ఎదురుచూపులు మదినిండా నింపుకుని. కాళ్లూ చేతులు చురుగ్గా కదలడం లేదు గానీ ఆలోచనలూ జ్ఞాపకాలూ ఇంకా చైతన్యవంతంగా కదులుతూనే వున్నాయి అమ్మలో. మా చిన్నప్పటి, నాన్న ఉన్నప్పటి జ్ఞాపకాలతో, తన అడుగుల పాదముద్రల్లోనే అడుగులేస్తూ, ఎనభై ఐదేండ్ల స్మృతుల్ని, అక్కడి గాలి, వెలుతురు, మట్టి, నీరు స్పృశిస్తూనే జీవనం సాగిస్తున్నది. తన ఘనమైన గొంతును వినిపిస్తూనే వుంది.
ఇవన్నీ నా వ్యక్తిగతమైన విషయాలే అయినప్పటికీ ఒక సామాజిక విషయాన్ని నా ముందుకు తెచ్చింది. వృద్ధుల బాగోగులకు, వారి ఆహ్లాద జీవనానికి బాధ్యత వహించగలిగే వ్యవస్తమనకు లేదు. పిల్లలు చూసుకోవటమనేది అంతంత మాత్రంగానే వుంటోంది. రేపు మనకూ ముసలితనం వస్తుంది. భర్తో, భార్యో ముందో వెనకో వొదిలి పోతారు. అప్పుడు తోడు ఎవరూ లేని జీవితం ఎంత బాధాకరంగా వుంటుందో! పిల్లలు, వాళ్ల పిల్లలు, వారి వారి పనులు, వొత్తిళ్లు, భవిష్యత్తు చింతనలో పడి సతమతమవటం చూస్తూనే వున్నాము కదా! చివరి మజిలీలో సాఫీగా సాగటం కష్టతరమైన విషయంగానే తయారవుతున్నది. ఒక వయసు దాటిన తర్వాత పెద్ద వాళ్లతో విషయాలు పంచుకునే వాళ్లూ వుండరు. అదే పెద్ద వెలితిగా వారికి తయారవుతుంది. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు సరేసరి. కాళ్లు లేవవు, చేతులు పట్టు తప్పుతాయి. కండ్లు కనపడవు. చెవులు వినపడవు. స్పర్శా అంతంత మాత్రమే. గట్టిగా అరచి చెప్పలేక ఎవరూ మాట్లాడటమే లేదనే బాధ ఒక్క అమ్మదే కాదు. అనేకమంది అమ్మలది, నాన్నలది. పనికిరాని వస్తువును చూసినట్టుగానే మనుషులనూ చూస్తున్న సమాజపు ఆధునికతను చూస్తున్నాం మనం. వాళ్లకేమో ఎప్పుడూ వాళ్లతో వుంటూ మాట్లాడే వాళ్లు కావాలి. ఎవరున్నారు? ఎవరుంటారు? ఇది పెద్ద సమస్య.
ఇక మా ఊర్లో దసరా పండుగ భలే సరదాగా సాగుతుంది. దేవుళ్ల రథాలు వివిధ బస్తీల నుండి ఊరేగింపుగా వచ్చి ఒకే ప్రాంగణానికి చేరుతాయి. దీపాలు, రంగురంగుల అలంకరణలు, ఒక నెల రోజుల ముందు నుండే ఏదో ఒక దేవుని కాన్సెప్ట్ తీసుకుని ఈ షావాలను సిద్ధం చేస్తారు. ఎవరి బస్తీ షావా బాగుందో చూసి ఎంపిక కమిటి బహుమతులూ ఇస్తుంది. జమ్మి పూజలూ, అదే ప్రాంతంలో జరుగుతాయి. పట్టణంలోని ప్రజలందరూ అక్కడికి చేరతారు. పెద్ద జన సందోహంతో ఊరు ఊరంతా ఉత్సవంలా మారుతుంది. మిత్రులు, పరిచయమున్న అందరూ అక్కడ కలుసుకుని జమ్మి పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేను చిన్నప్పటి నుండీ ఈ సరదాను చూస్తూనే వున్నాను. కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అధికార పార్టీ ప్రచార కేంద్రంగా కూడా ఇది మారింది. ఒక వేదిక ఏర్పాటు చేసి రాజకీయ ఉపన్యాసాలు, ప్రజాప్రతినిధుల హడావిడి పెరిగింది. అంతేకాదు, సెలబ్రెటీస్‌ను పిలవటం, డీజేలు పెట్టటం, సినిమా డాన్సులు, పాటలు, పిచ్చి జోకులు పెరిగిపోయాయి. కార్యక్రమమంతా స్పాన్సర్డ్ ఈవెంట్‌గా మారిపోయింది. ఉత్సవంలో సజీవత, హృదయపూర్వత సన్నగిల్లింది. జమ్మి పెట్టుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అసలు కనపబటమే లేదు. జన సందోహమంతా లైట్లు, రంగులు, అలంకరణలు, డ్యాన్సులు, పాటల కోసమే తప్ప మనుషుల్ని, స్నేహితుల్ని కలవటానికి రావటం లేదు. ఇక నా చిన్నప్పుడు లేని రావణాసురుని బొమ్మను దహనం చేయటం కొత్తగా వచ్చి చేరింది. ఏదిఏమైనా మనుషుల్ని కలవడం, పలకరించుకోవడం, ఆత్మీయతను పంచుకోవడమే అసలైన పండుగ. అందుకే నేను మా ఊరికిపోయేది.