Sun 09 Oct 03:45:07.452535 2022 భూమ్మీద తొలిరేకునైనేను విచ్చుకుంటున్నప్పుడేనాలో రెక్కలు విప్పుకుందినేనెవర్ననే ప్రశ్న!రివ్వున వీచే గాలికి కొట్టుకుపోయేకాగితంపువ్వునా?తలెత్తి అంతరిక్షం గూట్లోకి చూసేదేవదారు వృక్షాన్నా?కొండల్ని తొలుచుకుంటూనదులన్నీ వెతికేది నన్నేనా?రంగుల కళ్ళజోడు పెట్టుకున్న కాలాలూవలయాల అంచుల మీద నడిచే రుతువులూఅసలు నాకేమవుతాయి?చెట్టూ చేమా పురుగూ పిట్టల్ని కన్నాకఏ సమతూకం కోసంనేల మళ్ళీ నీళ్ళోసుకుంది?నన్నిక్కడ నేలలో విత్తిన మొట్టమొదటి ఉల్కనా ఈ విధ్వంస వర్తమానాన్నిఊహించి ఉంటుందా?ఏ పురాతన రక్తసంబంధం వున్నదనిశిఖరాలూ సముద్రాలూనన్నింత గారాబం చేస్తున్నాయి?పదే పదే ఎందుకు నన్ను క్షమిస్తున్నాయి?రోదసి లోయల్లోంచినా ఒంటరి పాటల్ని ఎవరైనా వింటున్నారా?వింటూ నవ్వుకుంటున్నారా?ఈ చదరంగంబల్ల మీదనేను విజేతనా? కేవలం పావు నేనా?నా చేతిలో ఓడిపోవడానికేఈ విశ్వం ఉందా?- సాంబమూర్తి లండ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి