Sun 23 Oct 05:33:48.839559 2022 ప్రకృతి ఒడినిండాపూల వనాలు ఉన్నాయి!కాలి బాటన వెళుతుంటే నవ్వుతూ పలకరిస్తాయి!పైపైకి ఎగబాగుతూ పూలతీగలుగా అల్లుకుంటాయి!పరిమళాలు వెదజల్లుటకై పువ్వులై వికసిస్తున్నాయి!ప్రేమను పంచుటకై పరితపిస్తూ ఉంటాయి!సూర్యుని రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాయి!స రి గ మ ప ద ని స లతో పాటలుపాడుతుంటాయి!ఎరుపైన పెదవులతో వేణువు ఊదుతుంటాయి!కాలికున్న మువ్వలతో నాట్యమాడుతుంటాయి!వాలు కనుల చూపులతో సైగలు చేస్తువుంటాయి!తుంటరి నవ్వులు విసురుతూ చేయి పట్టుకుంటాయి!శిశిరములో సైతం వసంతాలను పూయిస్తూ ఉంటాయి!కోకిల గానంతో మైమరిపిస్తాయి!కారు మబ్బులను కరిగించి వానలుగా కురిపిస్తాయి!సముద్రం అలలను మళయా సమీరాలుగా మారుస్తాయి!మనిషిలోని మాన వత్వాన్ని నిదురలేపుతుంటాయి!మానవ సమాజానికి ప్రేమ సందేశాన్ని అందిస్తాయి!- ఎస్. జవేరియా, 9849931255 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి