Sun 06 Nov 02:11:18.4245 2022
Authorization
ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. చిమ్మ చీకట్లోనూ సృష్టమైన లక్ష్యానికనుగుణంగా విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. నిర్దేశిత ప్రాంతంలో కచ్చితంగా దిగుతున్నాయి.కానీ జాతీయ రహదారిపై 60 మందితో ప్రయాణించే బస్సు క్షేమంగా బస్టాండ్‌కు చేరుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. షార్ట్‌సర్క్యూట్‌తో నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం సంభవించి ఎంతోమంది చనిపోయిన ఉదాంతాలూ ఉన్నాయి. క్షిపణులు ఆకాశంలో వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని సునాయసంగా చేధించ గలుగుతున్నాయి.కానీ భూమ్మీద ఉన్న వంతెనలు నిర్మాణంలోనే నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
ఒక్కో సంఘటన మనసుకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. హృదయాన్ని ఆవేదనకు గురిచేస్తుంది. అయ్యో.. ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి హృదయ విదారక ఘటన గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్నది. అక్టోబర్ 29న మోర్బీ పట్టణంలో ప్రారంభించిన మూడు రోజుల్లోనే తీగల వంతెన కుప్ప కూలింది. సుమారు 140మంది ఈ ప్రమాదంలో అసువులు బాశారు. మృతుల్లో రెండేండ్ల చిన్నారి సహా దాదాపు 50మంది వరకు పిల్లలున్నారు. బ్రిడ్జికి ఉన్న తీగలు తెగుతుంటే నదీ జలాల్లో ఒకరిపై ఒకరు పడుతూ చేసిన ఆర్తనాదాలు అక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. స్థానికులు సాయం చేసి కొంతమందిని కాపాడారు. అధికార యంత్రాంగం ఆలస్యంగా స్పందించే సరికి అప్పటికే మరికొంతమంది నీటిలోనే ప్రాణాలొదిలారు. ఇంకొంతమంది ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నం చేసి ఊపిరిలొదిలారు. బాధిత కుటుంబాల్లో ఇంతటి విషాదం నింపిన ఈ ఘటనకు కారకులెవరు?.
దాదాపు వందేండ్ల క్రితం బ్రిటీష్ కాలంలో కట్టిన కేబుల్ బ్రిడ్జిని మరమ్మతుల కోసం గుజరాత్ ప్రభుత్వం అజంతా బ్రాండ్ గోడ గడియారాలు, క్యాలిక్యూలేటర్లు, సీఎఫ్ఎల్ లైట్స్, ఈ బైక్స్ రూపొందించే ప్రయివేటు సంస్థ ఒరేవాకు కేటాయించింది. ఈ సంస్థ బ్రిడ్జి నిర్వహణకు 15 సంవత్సరాలు లీజుకు తీసుకుని రిపేర్ పనిని థర్డ్ పార్టీకి అప్పగించింది. అదేమో పాత వంతెనకు పైపై పూతలు పూసి మెరుగులు దిద్దింది. స్థానిక మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోలేదు. బ్రిడ్జి నాణ్యతను పరిశీలించిన నాథుడు అంతకన్నా లేడు. 125 మంది సామర్థ్యం ఉండే బ్రిడ్జిపై అమాంతం 500 మందిని అనుమతించడంతో ఒక్కసారిగా వంతెన తెగిపోయింది. ఇంత లోప భూయిష్టమైన నిర్మాణం, అది గుజరాత్ మోడల్‌గా చెప్పుకునే రాష్ట్రం కావడం పాలనా యంత్రాంగంలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.
పర్యాటకం పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. రెండేండ్ల కరోనా తర్వాత స్వేచ్ఛగా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కుటుంబంతో ఉల్లాసంగా గడపడం, స్నేహితులతో ఉత్సాహంగా ఉండటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులదే. వారికి భద్రత కల్పించడంతో పాటు రక్షణకు చర్యలు తీసుకోవాల్సింది కూడా వీరే. కానీ కొన్ని ఘటనలు జరిగినప్పుడు మరణాలు ఎక్కువగా ఉండటంతో కనీస భద్రత గాలిలో దీపంగా మారుతోంది. బయటకు వెళ్లిన వారు భద్రంగా ఇంటికి చేరుతామన్న ధీమా లేదు. మూడేండ్ల కిందట పాపికొండల్లో జరిగిన ప్రమాదం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకోవడం వల్ల కచ్చులూరు వద్ద బోటు మునిగి చాలామంది చనిపోయారు. ఈ విషాదం నుంచి బాధిత కుటుంబాలు నేటికీ కోలుకోనేలేదు.
ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. చిమ్మ చీకట్లోనూ సృష్టమైన లక్ష్యానికనుగుణంగా విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. నిర్దేశిత ప్రాంతంలో కచ్చితంగా దిగుతున్నాయి. కానీ జాతీయ రహదారిపై 60 మందితో ప్రయాణించే బస్సు క్షేమంగా బస్టాండ్‌కు చేరుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. షార్ట్‌సర్క్యూట్‌తో నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం సంభవించి ఎంతోమంది చనిపోయిన ఉదాంతాలూ ఉన్నాయి. క్షిపణులు ఆకాశంలో వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని సునాయసంగా చేధించ గలుగుతున్నాయి. కానీ భూమ్మీద ఉన్న వంతెనలు నిర్మాణంలోనే నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కొత్త సెన్సార్లు, అత్యాధునిక రాడార్లు అందుబాటులోకి వస్తున్నాయి. రక్షణకు కావాల్సిన పరికరాలు, దానికి బడ్జెట్ కేటాయింపు బాగానే ఉన్నా, వాటిని వినియోగించి భద్రతను కల్పించడంలో నిర్లక్ష్యపు నీడలు అలుముకుంటున్నాయి. ప్రమాదాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం విస్మరించడం మూలానా ఎప్పటిలాగే ప్రాణనష్టం తీవ్రంగా ఉంటోంది. దానికి ఉదాహరణగా మోర్బీ ఘటనను చెప్పుకోవచ్చు.