Sun 06 Nov 03:33:58.323204 2022 దీపమొకటి వెలిగించాలితిమిరాన్ని తరిమేసేందుకు.. ..దీపమంటే చమురు పోసివత్తివేసి వెలిగించడమే కాదుకదా..బతుకుబాటలో అడుగడుగునాదారిదీపాలు ఎన్నెన్నో వెలిగించాలి..ప్రయత్న దీపమొకటి వెలిగించాలివిధి రాతను మార్చేందుకు..మమతల దీపమొకటి వెలిగించాలిమతాల మత్తును వదిలించేందుకు.ప్రేమదీపమొకటి వెలిగించాలికులపు మెట్లు కూలగొట్టేందుకు..కరుణ దీపమొకటి వెలిగించాలిసాటిమనిషి కన్నీరు తుడిచేందుకు..జ్ఞానదీపమొకటి వెలిగించాలిఅజ్ఞానాంధకారాన్ని వెడలగొట్టేందుకు .ఆశా దీపమొకటి వెలిగించాలిఆకాశపు అంచులు అందుకోవడానికి..గెలుపు దీపమొకటి వెలిగించాలివిజయకేతనాన్ని ఎగరేసేందుకు..ఆత్మ దీపమొకటి వెలిగించాలిఅంతరంగాన్ని శోధించేందుకు..అఖండదీపమొకటి వెలిగించాలిగుండె గుడిలోకి చీకట్లు చొరబడకుండా..మానవత్వపు దీపాలు వెలిగించాలిమనిషి మనిషికీ పంచేందుకు..వెలుగుతున్న దీపమే కదాఇతరదీపాలను వెలిగించేది..- రోహిణి వంజారి, 9000594530 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి