నేను చేసి నీళ్లలో వదిలిన పడవ నాకు నేను కల్పించుకున్న ఆలోచన ఉన్నాయి రెండూ ఒకలా చిన్న చిన్న అలల మీద ఊగుతూ పోతోంది కాగితం పడవ తుది చేరని నా ఆలోచనల్లా అడ్డొచ్చిన్నప్పుడల్లా ఆగుతూ అలలకు పక్కకు తిరుగుతూ పోతున్న పడవను చూస్తూ తుది రూపం దిద్దుకుంటున్నాయి నా ఆలోచనలు అడ్డుగా ఉన్న అనవసర విషయాలను పక్కకు పెట్టి పడవ తడిచి చినిగిపోతున్నట్లే నా ఆలోచనలూ విడి పోతున్నాయి ఫలితం లేకుండానే మునుగుతున్న పడవను గాజు కళ్ళతో చూస్తూ నిలబడి పోయా నిస్తేజంగా.... నిర్లిప్తంగా....