Sun 11 Dec 00:00:40.763211 2022
Authorization
నేడు దళితులు, బీసీలు, ముస్లిం మైనార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంబేద్కర్ ఎవరి కోసం రాజ్యాంగాన్ని రాశాడు. కేవలం అణచబడిన కులాల కోసమేననే వాదన కొంత మంది ప్రచారంలోకి తెస్తున్నారు. ఆయన 'నిమ్నకులంలో పుట్టాడు కాబట్టి మా బతుకుల కోసం, మా హక్కుల కోసం, మాకు సమానత్వాన్ని కల్పించేందుకు పోరాడాడు' అని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునేవారిలో చాలామంది పాలించేవారున్నారు. దీనివల్ల అంబేద్కర్ తమవాడేనని, మీకు కాదని చెప్పేస్థాయికి చేరుకున్నారు. ప్రజల మధ్య చిచ్చు రగులుతుంటే చూస్తుండటం, రాజ్యాంగ ఫలాల ద్వారా అధికారంలోకి వచ్చిన వారు ప్రజల్ని విభజించడం, పాలించడంతో వారి మధ్య తెలియని అంతరాలు పెరుగుతున్నాయి. ఈ వాదన సరికాదని, అంబేద్కర్ అందరి వాడని చెప్పే పరిస్థితి వారు చేయడం లేదు. ఎందుకంటే అంబేద్కర్‌ను విమర్శించే వారుంటేనే, ఆరాధించే వారంతా తమకు దగ్గరవుతారనేది వారి అంతర్మథనం.
'ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నాడు' రష్యా విప్లవకారుడు లెనిన్. అందుకు తగ్గట్టుగానే దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బాబాసాహేబ్ అంబేద్కర్ మన నుంచి దూరమై డిసెంబర్ ఆరుకు సరిగ్గా అరవై ఆరు ఏండ్లవుతోంది. ఆయన చరిత్రను తడిమి చూస్తే జీవితమే ఒక సందేశోపన్యాసం. పోరాటం.. అణగారిన వర్గాలకు నిత్య చైతన్యం. దార్శనికత.. యావత్ ప్రపంచానికే ఆదర్శం. వాస్తవమే.. ఆయన పాఠశాలకు వెళ్లేదగ్గరి నుంచే అంటరానితనం, కులవివక్షను ఎదుర్కొన్నాడు. దాన్ని పారదోలేందుకు అక్షరాస్యతను ఆయుధంగా చేసుకున్నాడు. ఎన్నో పోరాటాలకు రూపకల్పన చేశాడు. శాంతియుతంగానే ప్రజల్లో ప్రభంజనాన్ని సృష్టించాడు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపాడు. అయితే అంబేద్కర్‌ను నిమ్నకులాలకు చెందిన నేతగానే కొంతమంది అభివర్ణిస్తున్నారు. ఆయన దళితుల కోసం పోరాడింది నిజం. చీకట్లో మగ్గుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపడం సత్యం. కానీ ఆయన రాసిన రా జ్యాంగం ఏ ఒక్క కులానిదో, మతానిదో కాదనేది స్పష్టం. ఆనాడు అంబేద్కర్ అసృశ్యతను నేరంగా పరిగణించాడు. కానీ ఆ నేరం నేటికీ కొనసాగుతుండటం బాధాకరం. అందరికీ ఓటు హక్కు కల్పించాడు. కానీ డబ్బున్నవాళ్లే ఆ ఓట్లను కొనుక్కోవడం దౌర్భాగ్యకరం.
ఈ రోజు దేశంలో చాలామంది అంబేద్కర్ జపం చేస్తున్నారు. పోటాపోటీగా ఆయన విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఒకరు కొత్త జిల్లాకు ఆయన పేరు పెడితే, మరొకరు నిర్మాణంలో ఉన్న సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేశారు. ఇంకొకరు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నారు. మరి వీరంతా దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నట్టేనా? ఈ సందేహం చాలామందిలో నెలకొంది. ఆ పేరుతో రాజకీయ లబ్ధి పొందుతున్న వారిని మనకండ్ల ముందే చూస్తున్నాం. కులమతాలకతీతంగా దేశంలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాత్వం కలిగి ఉండటం అంబేద్కర్ ఆశయం. బానిస సమాజాన్ని అంతం చేసి, కుల వ్యవస్థకు పునాదులుగా ఉన్న నిచ్చెనమెట్ల మనుస్కృతిని దహనం చేయడం. కానీ ఇన్నేండ్లవుతున్నా ఇది జరిగిందా? దాన్ని పెంచి పోషిస్తున్నదెవరు? అంటరానితనం, వివక్ష పోకుండా అడ్డుకుంటున్నదెవరు? పెద్ద విగ్రహాలను పెట్టడం వల్ల ఆయన పేరు వినిపిస్తుందేమో కానీ అంబేద్కర్ ఆకాంక్ష నెరవేరుతుందా?.
నేడు దళితులు, బీసీలు, ముస్లిం మైనార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంబేద్కర్ ఎవరి కోసం రాజ్యాంగాన్ని రాశాడు. కేవలం అణచబడిన కులాల కోసమేననే వాదన కొంత మంది ప్రచారంలోకి తెస్తున్నారు. ఆయన 'నిమ్నకులంలో పుట్టాడు కాబట్టి మా బతుకుల కోసం, మా హక్కుల కోసం, మాకు సమానత్వాన్ని కల్పించేందుకు పోరాడాడు' అని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునేవారిలో చాలామంది పాలించేవారున్నారు. దీనివల్ల అంబేద్కర్ తమవాడేనని, మీకు కాదని చెప్పేస్థాయికి చేరుకున్నారు. ప్రజల మధ్య చిచ్చు రగులుతుంటే చూస్తుండటం, రాజ్యాంగ ఫలాల ద్వారా అధికారంలోకి వచ్చిన వారు ప్రజల్ని విభజించడం, పాలించడంతో వారి మధ్య తెలియని అంతరాలు పెరుగుతున్నాయి. ఈ వాదన సరికాదని, అంబేద్కర్ అందరి వాడని చెప్పే పరిస్థితి వారు చేయడం లేదు. ఎందుకంటే అంబేద్కర్‌ను విమర్శించే వారుంటేనే, ఆరాధించే వారంతా తమకు దగ్గరవుతారనేది వారి అంతర్మథనం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25,26,27,28ల ప్రకారం భారతదేశంలోని పౌరులందరికీ మత స్వాతంత్య్రపు హక్కును ఇవ్వబడింది.ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రం, లౌకికవాదం సూత్రాలను స్థాపించుటకు ఉద్దేశించినవి. కానీ ఈ రోజు మత స్వేచ్ఛ ఎక్కడుంది? దేశాన్ని హిందూ రాజ్యంగా చేయాలనే ప్రయత్నం వాస్తవం కాదా? ప్రతీ పౌరుడు మత,వ్యక్తిగత స్వేచ్ఛ కల్పించబడ్డాడు. దేశంలో హిందూ, ముస్లింలు వేర్వేరుగా చిత్రీకరించబడుతున్నారు. మత కల్లోలాల వల్ల దూరమవుతున్నారు. 15, 21 ఆర్టికల్స్‌లో కులం, మతం, లింగం వివక్ష లేకుండా చూడాలని సూచిస్తున్నవే. ఆనాడు అంబేద్కర్ దేశ ప్రజలందరి కోసం ఆలోచించాడు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతీ సూత్రం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి, రక్షణకు, హక్కులు కల్పించేం దుకు దోహదపడేవే. కులమతాల విభజన సృష్టించేవారికి అంబేద్కర్ తమవాడేనని చెప్పుకునే నైతికత లేదు. ఆయన చూపించిన మార్గాలు అనుసరించడంతో పాటు వివక్ష లేని సమాజం, లైంగికదాడులు, హత్యలు లేని భారతం కోసం కృషి చేసినప్పుడే ఆయన జయంతి, వర్థంతులకు సరైన సార్థకత ఉంటుంది.