వేల వేల శబ్దాలు వేలాడుతున్నాయి చెవికి తోరణాలుగా శబ్దాలు ఎన్ని అయినా ఆకలి నేత్రంతో హదయాంతరంగంలో మేల్కొల్పిన శబ్దం మాత్రం ఇంకా మార్మోగుతుంది..
చెవులు ఉన్న చెవిటితనం నోరు ఉన్న మూగతనం సత్తువ ఉన్న చేతగానితనం ఏ కణం లోనైనా కనిపించని నిప్పుకణం నేను.
ఆలోచన అగ్ని దీపమై నాలుగు దిశలో సంచరిస్తున్న కాంతి కోణమై దయవున్న అభ్యుదయగీతమై విరబూసిన మందారనేత్రమై వికసిస్తానుజి రుధిర రాగమై..... ప్రకాశిస్తాను జనం కోరిన ప్రభంజనమై