Sat 07 Jan 23:17:31.134017 2023
Authorization
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సందర్భంగా పబ్‌లు, వైన్‌షాపులు, పార్టీలు, ఈవెంట్లకు రోజంతా అనుమతినిచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టుగానే చాలా మంది పీకల్లోతు వరకు పూటూగా తాగారు. అర్ధరాత్రి వరకు ఎంజారు చేసిన యువకులు తెల్లవారి కూడా మద్యం మత్తులోనే జోగారు. తాగి కారు డ్రైవ్ చేయడంతో బంజారాహిల్స్‌లో పుట్‌పాత్‌పై వెళ్తున్న పాదచారుల మీదకు దూసుకెెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఒకరు కుటుంబానికి పెద్ద దిక్కు. మరొకరు రోజూ పని చేస్తే గానీ పూటగడవని కూలీ. ఇలాంటివి దేశంలో అనేక ప్రమాదాలు. నష్టపోయిన జీవితాలకు ఎటువంటి బాధ్యత, జవాబుదారితనం లేదు. నిందితులకు శిక్షపడిందీ లేదు.
దేశమంతా నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటున్నది. చిన్నారుల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు వేడుకలతో అంతా సందడిగా ఉన్నది. గడిచిన జ్ఞాపకాలు, తియ్యని స్మృతులు నెమరవేసుకునేలోపే తెల్లవారు జామున ఢిల్లీ నడిబొడ్డున ఓ విషాదం. మద్యం తాగిన ఐదుగురు యువకులు కారు డ్రైవింగ్ చేస్తూ తన స్నేహితురాలితో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని ఢకొీట్టగా ఆమె ప్రాణం విడిచింది. మద్యం మత్తులో ఉన్న వారు అసలేం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అలాగే కారుతో మృతదేహాన్ని సుమారు పన్నెండు కిలోమీటర్ల మేరకు ఈడ్చుకెళ్లారు. ఆమె డెడ్‌బాడీ పోస్టుమార్టంలో విస్తుబోయే విషయాలు వెలుగుచూశాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమె చనిపోలేదు. కాపాడాలని ఆర్తనాదాలు చేసింది. మృతదేహం టైర్ల కింద ఇరుక్కోగా రోడ్డు మీద రాకుతూ వెళ్లగా పుర్రె పగిలిపోయింది. మెదడు నుజ్జయింది. వెన్ను విరిగింది. పక్కటెముకలు ఛాతిభాగంలోకి వచ్చాయి. శరీరంపైన చర్మం ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఇంతటి దారుణమైన మరణం ఇంకేమైనా ఉంటుందా? ఆమె చనిపోతూ ఎంత బాధను అనుభవించిందో తలుచుకుంటేనా ఒక్కసారి గుండె తరుక్కుపోతోంది. ఈ ప్రమాదానికి కారణం మద్యం, అతివేగం, నిర్లక్ష్యం.
అలాంటిదే రెండువేలా పదహారులో హైదరాబాద్ మనస్సాక్షిని కారుతో గుద్ది చంపిన ఘటన. బంజారాహిల్స్‌కు చెందిన తొమ్మిదేండ్ల రమ్య నగరంలోని కొత్త పాఠశాలలో మొదటిరోజు చేరిక. ఎంతో ఆనందంతో కుటుంబసభ్యులు ఆ చిన్నారిని తీసుకుని బయలు దేరారు. తల్లిదండ్రులు, తాత, ఇద్దరు మేనమామలు సహా రమ్యతోనే ఉన్నారు. అక్కడి పని పూర్తికాగానే తిరుగు పయనమయ్యారు. సరదా సంభాషణలతో సాగుతున్న వారి వాహనాన్ని అతివేగంగా వచ్చిన కారు ఢకొీంది. ఇందులో రమ్య, ఆమె మామ, తాత ముగ్గురూ మరణించారు. ఈ ప్రమాదానికి కారణం కూడా మద్యమే. రాత్రంతా మైనర్లతో తాగి అదే మత్తులో కారు నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడు ఇరవై యేండ్ల యువకుడు. ఈ ప్రమాద తీవ్రతను గుర్తించిన తెలుగు రాష్ట్రాల ప్రధాన పత్రికలు పతాక శీర్షికన ప్రచురితం చేశాయి. ఆ సమయంలోనే ప్రజలు 'రమ్య'చట్టం తేవాలనే డిమాండ్‌తో నిరసనలూ చేశారు. ప్రస్తుతం తండ్రి చనిపోవడంతో ఓ వైపు తల్లిని చూసుకునే బాధ్యత. మరోవైపు కూతుర్ని కోల్పోయిన బాధ నుంచి భార్యను కాపాడుకునే తపన వెంకటరమణది. ఈ మానసికక్షోభ వారంతా ఎందుకు భరించాలి? మైనర్లని వారిని బెయిల్‌పై విడుదల చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు లేకపోలేదు. ఈ ప్రమాద ధాటికి సమాజంలో ఒక వర్గం శిక్షను అనుభవిస్తుంటే మరో వర్గం డబ్బు, అధికారం, అన్యాయంతో రాజ్యాన్నేలడం శోచనీయం!
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సందర్భంగా పబ్‌లు, వైన్‌షాపులు, పార్టీలు, ఈవెంట్లకు రోజంతా అనుమతినిచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టుగానే చాలా మంది పీకల్లోతు వరకు పూటూగా తాగారు. అర్ధరాత్రి వరకు ఎంజారు చేసిన యువకులు తెల్లవారి కూడా మద్యం మత్తులోనే జోగారు. తాగి కారు డ్రైవ్ చేయడంతో బంజారాహిల్స్‌లో పుట్‌పాత్‌పై వెళ్తున్న పాదచారుల మీదకు దూసుకెెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఒకరు కుటుంబానికి పెద్ద దిక్కు. మరొకరు రోజూ పని చేస్తే గానీ పూటగడవని కూలీ. ఇలాంటివి దేశంలో అనేక ప్రమాదాలు. నష్టపోయిన జీవితాలకు ఎటువంటి బాధ్యత, జవాబుదారితనం లేదు. నిందితులకు శిక్షపడిందీ లేదు. ఒకసారి ప్రమాదం జరిగితే, పెదవి సానుభూతి మాత్రమే లభిస్తుంది.అది పెద్దదైతే అంత్యక్రియలకు కంటితుడుపు సాయం. తర్వాత రోజులు గడిచినా కొద్దీ దాని గురించి పట్టించుకునే వారు కూడాఉండరు. ఆపై వారి జీవితాన్ని కొనసాగించే వ్యక్తుల స్వల్పకాలిక జ్ఞాపకశక్తిలో మాత్రమే ఉంటుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు బాధ్యత వాహనం నడిపినవారిది మాత్రమే కాదు. మద్యం అమ్మేవారిపైనే కూడా ఉండాలనే డిమాండ్ నెటిజన్ల నుంచి వస్తోంది. చక్రం వెనుక ఉన్న తాగుబోతు డ్రైవరు వారి చర్యలకు బాధ్యత వహిస్తే, మద్యం అందించే కంపెనీ కూడా బాధ్యత వహించాలి. కానీ అలా జరుగుతుందా? అలా కోరుకోవడం సమాజంలో సగటు మనిషితత్వం. కాన్నీ దీన్ని పటిష్టంగా అమలు చేస్తేనే బాధితులకు న్యాయం. కానీ దీన్ని పట్టించుకునేవారేరి? ఈ వైపుగా మనం ఆలోచించనంత కాలం చట్టం కఠినంగా లేదని,అర్ధరాత్రి బార్లు ఓపెన్‌గా ఉంచారని,రోడ్లపై తనిఖీలు లేకపోవడంతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయనే కారణాలు వెతుక్కుంటున్నాం.