ఒక్కో అక్షరానికి మెదడులో విస్ఫోటనం పద పదానికి గుండెల్లో శతఘ్నులు వాక్య వాక్యానికి కళ్ళల్లో అగ్ని పర్వతాలు భావ భానికీ ఆలోచనల్లో భూకంపం కాగితంపై సిరాకు బదులు రక్తం పారుతోంది కలం పట్టుకున్న వేళ్లు చిగురుటాకులా వణుకుతున్నాయి సమాజం ఎటు పోతోంది మనిషి ఏమౌతున్నాడు స్కూలు వయసులోనే మృగంగా మారుతుంటే సమాజాన్ని చూడని వయసులోనే తోటి ఆడపిల్లను కర్కశంగా మింగుతుంటే ఎవరిదీ తప్పు ఏమో... కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఆధునిక విజ్ఞానానిదా, సమాజానిదా, పెంపకానిదా, అభం శుభం తెలియక చేసిన స్నేహానిదా కళ్లు మసక బారుతున్నాయి రాసే అక్షరాలు చెరిగి పోతున్నాయి కలానికి పక్షవాతం వచ్చినట్లౌతోంది కాగితం చినిగి పోయింది పాళీ విరిగి పోయింది - జి. మధు మురళి