Sun 19 Feb 00:12:25.086286 2023 మనవి భాగ్యవిధాత బడ్జెట్టు కాదువిధాత వరప్రసాద అభాగ్య బడ్జెట్టేకేటాయింపుల గణితంకల్పిత బ్రహ్మ రాసే రాత అర్థమైతదేమో కానీశిల్పంలా చెక్కిన మన ప్రజాస్వామ్య బడ్జెట్టు అర్థంకాదుకొత్త ఆర్థిక స్వభావ నిఘంటువును వెతకాల్సిందేసంపన్నుల సంపదకు రాయితీలుప్రజలకు శఠగోపం పెట్టే వరాలుపేదలకు మొట్టికాయలుశ్రమకార్చిన చెమట చుక్కలకుమండుటెండ రాయితీఉండలేక ఊగులాడుతూఉట్టెక్కిస్తున్నామనేసూక్తి ముక్తావళి ముక్తిపోటుబతుకు వెలుగులకు సమాధి కట్టేవిద్యుత్తు వినియోగ ఛార్జీల వాతవిద్యకు కేటాయింపులు హళ్ళికి హళ్ళి సున్నకు సున్నప్యాకేజీ కాగితాలకే పరిమితంఉద్యోగాల భర్తీ ఊసులేని ఖజానానిరుద్యోగ భూతానికి స్వేచ్ఛావిహార పర్మిషన్గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున ఉరికెన్సమస్యకు పూరణలేని ధారణమనప్రజాస్వామ్య బడ్జెట్టుకాగితాల మీదనే కేటాయింపుల మ్యాజిక్కుఆచరణలో జీరో ఖాతాలుప్రజా బడ్జెట్టు బ్రహ్మాండంప్రజలకు పస్తుల సిస్తుల బహుమానంభళా అభాగ్య విధాత బడ్జెట్టూ! భళా! భళా!- వల్లభాపురం జనార్థన, 9440163687 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి