Sun 19 Feb 00:17:12.456031 2023 తీరంలోచంద్రుడు లాంతరుబీర తీగ అల్లుకున్నతాటాకు గుడిసె.రాత్రిఒడ్డు పడవలోపగలంతా పని చేసిన వలలుఒళ్ళు మరచి నిద్రిస్తున్నాయి.ఎండిన కొబ్బరి మట్టలతోరగిలిన రాళ్ళ పొయ్యిలోకాలుతున్న చేపల వాసన.వెన్నెలకు మత్తెక్కించేచల్లని తాటికల్లుచెరుకు తోటలనుండిపలకరించే తీపి వాసన.గోదావరిసాయంకాలం అలాఒడ్డున కూర్చొని సేదతీరుతుంది.దూరంగామరో పాత పడవఇసుక తెన్నెలపైపురాతన బైరాగి గీతమైవలను సర్దుతుందిమన్నెం విల్లంబునువిజయ గర్వంతోగోదారిలో కడుగుతుంది.పాయ నీటి చేతులెత్తివీర తిలకం దిద్దుతుంది.అడవి పడుచుఅమాయకపు నవ్వులాఎంత తెల్లగా పారుతోందిగోదావరి.అది నల్లని చీకట్లు చీల్చుతూమెరిసే వెన్నెల కాంతి దారి.- మణీందర్ గరికపాటి 9948326270 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి