Sun 26 Feb 01:14:20.454797 2023
Authorization
ఇలాంటిదే పదేండ్ల కిందట జరిగిన ఘటనలో రెండేండ్ల చిన్నారి చనిపోయింది.తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వీధికుక్కలు రావడంతో అప్పుడప్పుడే నడక నేర్చుకున్న పాపాయి భయంతో పరుగెత్తి అక్కడే ఉన్న బావిలో పడి శవమై తేలింది.ఇలా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘటనలు సంభవించినా కంటి తుడుపు చర్యలే తప్ప శాశ్వత చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం.దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రంగా పేరు. హుస్సేన్‌సాగర్‌లో ఆకాశహార్యాలు నిర్మించాలనేది పెద్దల ఆలోచనా.కానీ ఓవైపు మూసీ బాధ, మరో వైపు వానరాలు,శునకాల బెడద.అప్పుడప్పుడు ప్రదీప్ లాంటి ప్రమాదాలు చూస్తే పిల్లలకు స్వేచ్ఛ నిద్దామా? కనీసం ఇంటిముందు ఆడుకున్నా ఏం జరుగుతుంతో తెలియదు కదా! అసలు భాగ్య నగ రంలో భరోసా ఉందా?అనే అనుమానం రాకమానదు.ప్రదీప్ ఘటన తర్వాత ఆలస్యంగానైనా వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం జీఎహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.కానీ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం పట్ల సామాన్యుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
కొన్ని ఘటనలు గుండెల్ని పిండేస్తాయి..మరికొన్ని సన్నివేశాలు కండ్లముందే నిలుస్తాయి ఇంకొన్ని దృశ్యాలు అసలు నిద్రే లేకుండాచేస్తాయి..వాటి గురించి చెప్పడానికి భావాలే తప్ప భాష సరిపోదు.కన్నీళ్లే తప్ప వర్ణనా ఉండదు.అలాగని చెప్పకుండా ఉండలేం..మాట్లాడకుండా తప్పించుకోలేం.అలాంటి హృదయ విదారక ఘటన విశ్వనగరాన్ని ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచింది. హైదరాబాద్ నడి బొడ్డున కుక్కలు దాడిచేయడంతో మరణించిన బాలుడి ఉదంతం నిజంగా ప్రతీ ఒక్కరిని కలచివేసింది. ఇది జరిగి సరిగ్గా నేటికీ వారం. ఈ వార్త టీవీల్లో స్క్రోల్ అవుతుండగానే నా మనసు పడిన ఆవేదన అంతా ఇంతాకాదు. అభం శుభం తెలియని చిన్నారికి ఎందుకింత పెద్దశిక్ష! తల్లిదండ్రుల అప్యాయతల్ని అనుభవించలేదు. అక్కతో కలిసి బడికివెళ్లే భాగ్యాన్ని నోచుకోలేదు. స్నేహితులతో సరదాలూ పంచుకోలేదు. నాలుగేండ్లకే నూరేండ్లు నిండటం అత్యంత బాధాకరం.దీన్ని విధి వైపరీత్యంగానో, ప్రమాదవ శాత్తు మరణంగానో భావిస్తే గనుక మూమ్మటికీ తప్పే!ఈ మరణానికి బాధ్యులు జవాబు చెప్పాల్సిందే? ప్రదీప్ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించడం మంచి పరిణామం.
ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక నిజామాబాద్ నుంచి పట్నానికి వలసొచ్చిన ఆ కుటుంబాన్ని విధి కోలుకోలేని దెబ్బతీసిందనే చెప్పాలి.అంబర్‌పేట్‌లో కార్ల షోరూంలో ఉపాధి పొందుతున్న గంగాధర్ తన కుమార్తె, కుమారుడు ప్రదీప్‌ను పని ప్రదేశానికి తీసుకుపోవడం,విధుల్లో నిమగమై అతను గమనిం చకపోవడంతో అక్కడ కుక్కల గుంపు బాలునిపై దాడిచేశాయి.భయంతో బాలుడు పరుగులు తీసినా లాభం లేకపోయింది.నోట కరుచుకుని అటూ ఇటూ విసిరేస్తూ వేలాడదీసి మరీ రక్కాయి.తల,శరీర భాగాలు రక్తస్రావమయ్యాయి. ఆరేండ్ల అక్క చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో 'డాడీ..డాడీ'అని కేకలు వేస్తూ భయపడుతూ దాక్కోవడం తనవంతైంది.ఆ వయ సులో ఇంత కన్నా ఏంచేస్తారు?అప్పటికే తండ్రి వచ్చి ఏమైందని అడిగేలోపే బాలున్ని కుక్కలు కార్ల మధ్యలో బూడిదలో పడేశాయి.వెంటనే కొడుకును భుజాన వేసుకుని ఆస్పత్రికి పరిగెత్తాడు.'నా కొడు కును బతికించండి' అంటూ రోధించాడు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.దాడి సమయంలో బాట సారులెవరూ అక్కడ లేకపోవడం విచారకరం.
ఇలాంటిదే పదేండ్ల కిందట జరిగిన ఘటనలో రెండేండ్ల చిన్నారి చనిపోయింది.తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వీధికుక్కలు రావడంతో అప్పుడప్పుడే నడక నేర్చుకున్న పాపాయి భయంతో పరుగెత్తి అక్కడే ఉన్న బావిలో పడి శవమై తేలింది.ఇలా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘటనలు సంభవించినా కంటి తుడుపు చర్యలే తప్ప శాశ్వత చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం.దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రంగా పేరు. హుస్సేన్‌సాగర్‌లో ఆకాశహార్యాలు నిర్మించాలనేది పెద్దల ఆలోచనా.కానీ ఓవైపు మూసీ బాధ, మరో వైపు వానరాలు,శునకాల బెడద.అప్పుడప్పుడు ప్రదీప్ లాంటి ప్రమాదాలు చూస్తే పిల్లలకు స్వేచ్ఛ నిద్దామా? కనీసం ఇంటిముందు ఆడుకున్నా ఏం జరుగుతుంతో తెలియదు కదా! అసలు భాగ్య నగరంలో భరోసా ఉందా? అనే అనుమానం రాకమానదు.ప్రదీప్ ఘటన తర్వాత ఆలస్యంగానైనా వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం జీఎహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.కానీ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం పట్ల సామాన్యుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
నగర మేయర్ మాటల్ని నెటిజన్లు జీర్ణించుకోలేక పోయారు బాధ్యతగా వ్యవహరిం చాల్సింది పోయి ఆకలితో ఉన్నందునే కుక్కలు అలా చేశాయని చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడం ఎంతవరకు సమంజసం? దీనికి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి మటన్,చికెన్‌షాపులు,పంక్షన్హాళ్ల వద్ద వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడే వేయడం, పారిశుధ్యం పేరుకుపోవడంతో కుక్కలు తిష్టవేయడం చూ స్తూనే ఉన్నాం.దీనిపై చర్యలు తీసుకోవడంలో చాలా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది.వాటి ఆగడాలను తగ్గించేందుకు నీటితొట్లను ఏర్పాటు చేయాలి.విద్యార్థులకు,నివాసులకు అవగహన కల్పించాలి. ఇవన్నీ జరుగుతాయని ఆశించచవచ్చా? ఏది ఏమైనా జరిగింది ఘోరం. తన చేయి పట్టుకుని నడిచే కొడుకు ఇక లేడని తండ్రి, తోబుట్టిన తమ్ముడు తోడుగా రాలేడని అక్క, నవమాసాలు మోసిన తల్లి ఇక గోరు ముద్దలు తినిపించలేను అనే బాధను ఎవరు తీరుస్తారు?