యత్ర నార్యంతు పూజ్యం తే రమంతే తత్ర దేవతా వనిత భువి పై నడయాడే దేవత ఆమె మహిలో మహిమాన్విత వారు మమతల మణి దీపాలు బుద్ధి కశలతల విశారదులు మహిళ లేక లేదు నీ ఉనికి చచ్చెనా నీ లోన మానవత్వం చొచ్చెనా నీ లోన రాక్షసత్వం సీతమ్మ ను అపహరించి లంకకు చేటు తెచ్చే రావణుడు ద్రౌపదిని అవమానించి దుర్యోధనుడు కురువంశ వినాశనమునర్చే పాపం చేసి శాపం బొందే ఇంద్రుడు మహిళా దినోత్సవం నేడు ఒకసారి గతంలోకి తొంగి చూడు అనసూయ సావిత్రి సత్యభామల ధీరత్వం చూడు! దేహమున అర్ధ భాగం ఇచ్చి శివుడు అర్ధనారీశ్వరుడయ్య! వక్షస్థలమున శ్రీ దేవిని నిలిపి భక్తి భావము చాటే వెంకటేశ్వరుడు! గుణపాఠం నేర్వని మనిషి లోగిలిలో ధృతరాష్ట్ర కౌగిలి! ఆమె ఓ అద్భుత శక్తి గోళం నువ్వో ఉత్సహ విగ్రహం ఆమె మూల విరాట్టు! ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది- అమ్మై మరో రూపాన్ని! అవమానిస్తే దహిస్తుంది-అంబై మరో రాక్షసుడిని! మనిషి నీవెంత వారి చెంత మదిలో నిలుపు వారి చరిత ఇలపై ప్రకృతి పాటించు సమధర్మం హితము కలుగు మహికి వాటి పథం ప్రకృతి సమవర్తి సమత నిలుపు వారి ఘన కీర్తి అవనిలో వారు అవతారికలు కలిగించు జీవితాలకు నిండుదనాలు ఓ వనితా అందుకో సహస్ర కోటి వందనాలు! (మహిళా దినోత్సవం సందర్భంగా) - పి.బక్కారెడ్డి 9705315250