స్త్రీ అంటే కర్తవ్యం అనే వెన్నెముక పడతి అంటే ధర్మమనే చంటి బిడ్డను వీపున జేర్చిన రుద్రమ! తరుణి అంటే సేవారంగంలో కీర్తి గాంచిన మదర్ థెరిస్సా అతివ అంటే అంతరిక్ష యానం చేసి స్త్రీలకు ఆదర్శంగా నిలిచిన సునీత విలియమ్స్ వనజాక్షి అంటే తన హయాంలో ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన ఇందిరాగాంధీ ఉవిధ అంటే బిడ్డల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి సమానత్వముతో ప్రేమను పంచే మాతృమూర్తి ఇంతి అంటే ఏమి ఆశించకుండా కుటుంబ భారాన్ని మోస్తూ కర్తవ్య దీక్ష చేసే ధీరురాలు వనిత అంటే తను పస్తులుంటు తనబిడ్డల ఆకలి తీర్చే అన్నపూర్ణ పద్మానన అంటే అవసరమైతే తన కుటుంబ రక్షణకై శత్రువులను చండాడే అపర కాళికా దేవి. అబల అంటే చదుసంద్యల్లో ఆరితేరిన సరస్వతి కర్తవ్య పాలనలో మునిగి తేలే జలజాక్షి ఎన్ని పేర్లతో పిలిస్తే ఏమున్నది మహిళ కోరుకునేది గుర్తింపు - అనిత దావాత్, 9394221927