Sun 04 Apr 00:37:01.585565 2021
Authorization
''ఏవండీ...! ఈ మధ్య రాజేష్ ఎందుకో దిగులుగా ఉంటున్నాడు. ఏమైందో ఒక్క సారి కనుక్కోరూ...''
కొడుకు ఒంటరితనాన్ని గమనించి శ్యామల భర్తకు చెప్పింది.
''అదేంటే... వాడికేమయ్యింది. ఒంట్లో బాలేదా! ఏమైంది వాడికి.'' మదనపడుతూ అడిగాడు మణికంఠం.
''ఏమోనండి! మొన్నటినుండి సరిగ్గా మాట్లాడట్లేదు, టైంకీ తినడంలేదు, అడిగితే విసుకుంటున్నాడు''.
''అదేంటి! వాడికి నీ మీద కోపం రావడమేంటి అలా జరిగే అవకాశమే లేదే...'' మాటల మధ్యలో కలగజేసుకుని అడిగాడు మణికంఠం.
''ఏమో తెలీదు బాగా చిరాకుపడుతున్నాడు.'' ఇంట్లో కొడుకు ప్రవర్తనను శ్యామల స్పష్టంగా భర్తకు వివరించింది. ''సరే నేను కనుకుంటాను నువ్వు పడుకో... గుడ్ నైట్''
''మారీ గట్టిగా అడగకండీ... ఎదిగొచ్చిన కొడుకు''.
''అలాగే... నువ్వు పడుకో''. తలుపేసి అక్కడి నుండి కదిలాడు మణికంఠం.
''టైం పది కావొస్తుందే! రాజేష్ రాలేదేంటీ... ఆ అదిగో వచ్చినట్టున్నాడు'' గేటు తీస్తున్న శబ్దం విని గుమ్మంలోకి కదిలాడు మణికంఠం. ''రేరు రాజేష్ ఏంట్రా ఇది! నువ్వు తాగడం ఏంట్రా'' తూలుతూ పడిపోతున్న కొడుకుని భుజం పై వాల్చుకుని అడిగాడు మణికంఠం.
''మోసపోయాను నాన్న నేను మోస పోయాను. మూడు ఏండ్ల నుంచి ప్రేమిస్తున్న అమ్మాయి ఇలా చేస్తుందని ఊహించలేకపోయాను. తనని చూసిన మొదటి క్షణం నుంచి, అమ్మని చూసాను తనలో. అలాంటిది నన్ను ఈ రోజు ఇలాంటి ధీనమైన స్థితికి గురిచేస్తుందని గమనించలేక పోయాను. ఎన్నో కలలు కన్నాను నాన్న.
పెళ్లి, పిల్లలు , ఉద్యోగం. మహారాణి చూసుకుందామన్న''. ''అంటే..! ఇదంతా అమ్మాయి కోసమన్న మాట. చూడు నాన్న, నేను కూడ నీ వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించా. నీ లాగే కలలుకన్న,
నేను కూడ మోసపోయా.... రోజు తాగడం, ఇంట్లో మర్యాద లేకుండా ప్రవర్తించడం. అలా జీవితంలో రెండేండ్లు గడిచిపోయాయి. మీ నాన్నమ్మ తాతయ్య నన్ను బలవంతంగా ఒప్పించి, మీ అమ్మని కట్టబెట్టారు నాకు.
మెల్లి మెల్లిగా ఆ మత్తునుంచి కోలుకుని మీ అమ్మను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నేను కన్న కలలు మీ అమ్మతో కొత్తగా చిగురించాయి. ఒకరిపై ఒకరికి కలిగే ప్రేమ రోజురోజుకీ మమ్మల్ని మరింత దగ్గర చేసింది. మా ప్రేమలో మేము లీనమైకన్న మొదటికలకు ప్రతిరూపం నువ్వు. అలాంటి ఆనందపు క్షణాలలో నువ్వు మాకు పుట్టడంతో మా ఇరువురి ప్రేమకు, సంతోషానికి అవద్దుల్లేవ్. తీరా జీవితమంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో, ఒకప్పుడు నేను తాగితాగి అనుభవించిన బాధ మళ్ళీ నన్ను క్యాన్సర్ రూపంలో ఆవరించింది. నా దురదుష్టమేంటంటే..! నా మరణం మీకు తెలియడం. ఇప్పుడు నువ్వు ఆ పిల్లమీద పెట్టుకున్న ఆశలు నేను నీ మీద పెట్టుకున్నా, నేను పోయినా నువ్వు మీ అమ్మని జాగ్రత్తగా... ఏలోటు లేకుండా చూసుకుంటావని నా నమ్మకం''. దుఃఖాన్ని లోపలే దాచుకుని కొడుక్కి జీవితం విలువ తెలిపాడు మణికంఠం.
''చూడు
''సారి నాన్న'' ఏడుస్తూ తండ్రిని కౌగిలించుకున్నాడు రాజేష్. ''చూడు నాన్న... మీరు ప్రేమించిన అమ్మాయి మీ కంటికి అమ్మలా కనిపించడం కాదు. మాకు అనిపించాలి మా ఇంటి గౌరవాన్ని కాపడగలదని. ఇదిగో నీకు న్యూయార్క్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. వచ్చే నెల పదో తేదీ నీ జాయినింగ్''. కొడుకుని ఓదారుస్తూ చేతికి లెటర్ ఇచ్చాడు మణికంఠం.
'' లేదు నాన్న ఇక్కడే హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను.
ఉన్నంతకాలం నాతో
మీరు , మీతో నేను.
ఎక్కడున్నా ముగ్గురం కలిసే....'' న్యూయార్క్ జాబ్ ఆఫర్ లెటర్ని చించుతూ రాజేష్ తన తండ్రితో చెప్పాడు.
''నీ ఆనందం కంటే నాకు ఇంకేం కాను'' అని మనసులో అనుకుంటూ
''ఇంకెప్పుడు నువ్వు ఇలా తాగనని మాటివ్వు'' అంటూ తన అరచేతిలో కొడుకు చేతిని చేర్చుకున్నాడు మణికంఠం.
- కొమారి భరత్,
9951291442