Sat 16 Oct 22:41:44.089735 2021
Authorization
పల్లవి: అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో..
ఆ తరానికీ ఈ తరానికీ జరిగే ఈ సంగ్రామంలో..
కన్న తల్లికీ కట్టుబడని తీర్పు..
కట్టిన తాళికీ కరిగిపోనిదీ తీర్పూ..
ఇది మగజన్మకే..ఏ..ఏ..వచ్చిన మార్పూ
కాదా.. కాదా.. కాదా.. యస్ ..
I am in the hands of marriage law..
Any thing happens.. it's not my flaw..
చరణం : జన్మనిచ్చినది తల్లీ.. నమ్మివచ్చినది ఆలీ కమ్ముకొస్తుంది యుద్దం..
పురషజన్మకిది ఖర్మం..
జన్మనిచ్చినది తల్లీ.. నమ్మివచ్చినది ఆలీ
కమ్ముకొస్తుంది యుద్దం..
పురషజన్మకిది ఖర్మం..
అన్యోన్యతనే కరువైనప్పుడు..
అపార్థాలకే తావైనప్పుడు
మీరు మీరు కాదు..ఊ..ఊ..
నేను నేను కాను..ఊ.. నేను నేను కానూ..
ఇక ఆ ఇంటికే వచ్చెను చేటు...
కాదా.. కాదా.. కాదా.. యస్..
చరణం2: సీరియల్ కోసం.. కోడలుపిల్ల వంటవార్పుమానేసినదీ..ఈ..ఈ
కోడలికి బుద్ధులుజెప్పే.. అత్తమ్మే తెడ్డునాకినదీ..ఈ..ఈ
ఇంటిఫుడ్డునే కాదని నేను..
హౌటల్ఫుడ్డార్డరు చేసినదీ..
ఈ ఉల్లిఘాటునే భరించి
నేనీ కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకోసం.. ఆ.. ఎందుకోసం.. ఆ..
వండుకోవాలి నాది ఆకలి కనుకా.. మెక్కిఉర్కాలి అది రుచి లేకున్నా..ఆ..
అమ్మనేమన్నా.. నా హాఫ్ నేమన్న..ఆ..
ఇక యుద్ధమే కనుక..ఆ..ఆ
ఆ ఆ..యుద్ధంలో..
నే న్యూట్రల్ కనుకా..ఆ..ఆ.. ( అత్తలకు కోడళ్ళకు )
''జస్టిస్ చౌదరీ''(1982) చిత్రంలోని ''చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో'' పాటకు పేరడీ. రచన వేటూరి.
- డా|| బి.బాలకష్ణ,
9948997983.