Sat 04 Dec 22:54:22.403077 2021
Authorization
కోరస్: జోగి జోగి రాసుకుంటే వచ్చే దింక ఏమిటంట?
నువ్వు నేను చెప్పుకుంటే తీరదంట ఈ తంట
ఆన్సైటు అన్నలారా ఆఫ్‌షోర్ తమ్ముళ్లారా
నాన్-సింక్ పాటకైనా కోరస్ మీరు కలపలేరా?
జోగి జోగి రాసుకుంటే వచ్చే దింక ఏమిటంట
పల్లవి: నూతిలో కప్పలాగ, నడవలేని ఎద్దులాగ ఎన్నాళ్లు
చేపలా ఈదుతున్నా కనపడవెవరికి కన్నీళ్లు
అయ్యో రామా, ఏంటీ డ్రామా, బోలో మై బ్రో
చరణం1: ఊపిరి సలపని, ఉనికే తెలియని ఉద్యోగంలో
రేపటి రోజుని తలుచుకు బ్రతికే ఉద్వేగంలో
కోకుకు కూడా కిక్కుని తెచ్చే పని వేళల్లో
కోపం చిరాకు జాలిని చూపే మనిషైయ్యాను
ఎందుకు నీకీ హైరానా రిజైన్ చేసేరు మామా
ముందుకు పదవోరు ఎంచక్కా వర్కుని వదిలెరు మచ్చా
చాల్లే గానీ చెప్పొచ్చావు జాబే దైవం
చరణం2: రాజీ పడనని ఈగో వీడితే ఉందో సలహా
క్రేజీ కానిది చేస్తారెందరో మరి ఈ తరహా
సాలరి హైకుకి మొహమే వాచిన ఓ సాయంత్రం
సాగిలపడి నువు బాసుకి మొక్కడమే మంత్రం
రాయల్‌గానే ఉంటాను, లాయల్‌గా పని చేస్తా
ఫైనల్ అప్రైజల్ ఐతే అన్నీ ఆలోచిస్తా
ఉన్నాయెన్నో అవకాశాలు సోచో సమ్జో
కోరస్: జోగి జోగి రాసుకుంటే వచ్చే దింక ఏమిటంట?
నువ్వు నేను చెప్పుకుంటే తీరదంట ఈ తంట
ఆన్సైటు అన్నలారా ఆఫ్‌షోర్ తమ్ముళ్లారా
నాన్-సింక్ పాటకైనా కోరస్ మీరు కలపలేరా?
జోగి జోగి రాసుకుంటే వచ్చే దింక ఏమిటంట
(''బంగారు బుల్లోడు'' చిత్రంలోని ''స్వాతిలో ముత్యమంత'' అన్న వేటూరి గారి పాట సరళిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యాంత్రిక జీవికపై కుడికాల వంశీధర్ పేరడీ గీతం'')
- కుడికాల వంశీధర్, 9885201600