Sun 13 Mar 03:32:58.738269 2022
Authorization
''అవి పదిహేనేళ్ల కిరదటి వరకున్న రోజులు. పిల్లలు పిలకలెత్తే వరకే ఊరు. ఆ తర్వాత వాళ్ల సదువులనుకురట అరదరు పట్నం బాట పడుతున్రాయె. రెరడు పాలకూర కాడలు పండిరచరానోడు కూడ ఎకరం అమ్మితే రెరడు ఫార్చునర్ కార్లొస్తయని పగటి కలలు కంటురడాయె... పట్నరల డబ్బులున్నోడేమో భూమిని మిరచిన పెట్టుబడిలేదని కొనుక్కొని వదిలేస్తురడాయె. నూటికి పది మంది ఓ మడో రొరడు మళ్ళో పండిరచుకురదామంటే అడుగడుగున గండాలేనాయె. ఎద్దుల్లేవూ... ఎవుసాయాల్లేవూ'' అమ్మ మొఖంలో విచారం కనపడిరది.
కాసేపు ఆలోచనల్లో పడిన పూర్ణ అమ్మతో గట్టిగా ''అన్నపూర్ణమ్మా ! వస్తవా, రావా? మళ్లీ మళ్లీ అడుగుతున్నా'' పేరు పెట్టి పిలిచేసరికి ఫక్కున నవ్విరది అమ్మ.
''సరే నడు'' అని బయల్దేరిరది. నేనూ అనుసరిరచక తప్పలేదు. బాటపొరటి నడుస్తురటే అక్కడోటి ఇక్కడోటి అన్నట్టూ చేన్లు కనిపిస్తున్నయి. పరిశీలనగా చూస్తే చేన్లు కూడా కాదు వేరుశనగలు దూసిన తర్వాత ఎండిపోబోతున్న మొక్కలు. చుట్టూ చీరలతో చుట్టబడి వున్న చేను.
''అమ్మమ్మా ! ఈ చీరలేరది ఇట్లా చేను చుట్టూ కట్టిన్రు!?'' ప్రశ్నల పరంపర షురూ చేసిరదిరక.
''అడివి పందుల రందిపడలేక మొదట జనాలు కరెరటు తీగలు చుట్టి, తెల్లవార్లూ కరెరట్ పెట్టేది. దానికి మనుషులూ, పశువులూ, మూగజీవాలూ బలైతున్నయని అది బందు చేసిరి. కొన్నాళ్లు మెరుపు కాయితాలు పెట్టిరి. నిప్పు రాజేశి తెల్లవార్లు కావలురడిరి కొన్ని దినాలు. ఇప్పుడు ఈ చీరల ప్రయోగం చేయబట్టిరి జనం. చానా మంది యవుసమే మానుకొన్రి. మీ మేనమామనే సగం భూమి అమ్ముకొని జేసీబీలూ, టిప్పర్లు కొనుక్కొని పట్నరల బతుకుతనని పాయె'' మెల్లగా నడుస్తూ ఆయాసపడుతురది తను.
''అడవిపందులకు ఏం కావాలె అమ్మామ్మా? ఎందుకొస్తున్నయి వూళ్లెకు?''
''తిరడి కావాలె. తిరడి కోసం, నీళ్ల కోసం ఆ గుట్టమీదంగ కిరదకొస్తయి. ఈ చేన్లకు వచ్చేదాక వాటికి మధ్యన తిరడి దొరకదాయె, నీళ్లు దొరకవాయె. అరదుకే అవి యిట్ల నష్టర చేయవట్టె''
''అమ్మమ్మా ! మా చిన్నప్పుడు కూడ ఈ చిన్నగుట్ట మీ ఊరి పక్కన్నే వురది కదా. అప్పుడు లేని సమస్య ఇప్పుడెరదుకొచ్చిరదంటవ్'' ఆలోచిస్తూనే ప్రశ్న బాణంలా విసిరిరది.
అమ్మ నవ్వుతూనే, ''బాగ అడిగినవు తల్లీ. నీ కడుపున పుడ్తనే మల్ల జన్మల'' ఆయాసం తీర్చుకోవడానికి కాసేపాగిరది. మేమూ నిలబడ్డాం. ఎర్రటి ఎండ. అమ్మ చెప్పినట్టే ఒళ్లంతా భగ్గుమంటురది.
''నేను పుట్టి ఎనభై ఏండ్లయ్యిరదేమో... నా పుట్టిల్లూ మెట్టిల్లే కాదూ మా అమ్మమ్మ గారిదీ ఈ ఊరే. మా తాతల కాలం నురడీ యవుసం చూస్తున్నా. చేన్ల చుట్టూ ఈత చెట్లూ, తాటిచెట్లూ, బలుసు చెట్లూ... చెరువంచున వున్న చేన్లకు తుమ్మచెట్లూ, తుమ్మ కంపా కంచె వేసుకొని కాపాడుకొనేది. ఆయనే కాదు, అరదరూ మురడ్ల చెట్లను కూడ మురిపెరగ చేన్ల చుట్టూ పెరచుకున్నరు. రాన్రానూ భూమి పంపకాల పేరు మీద అమ్ముకొనిపోయే పేరాశలతోటీ జనం చేనుకూ చేనుకూ మధ్య కంచెలను తీసుకోవటం మొదలైరది. గప్పటిసంది అడవిపందులే కాదు... గెట్టు పంచాయితీలు కూడ పెరిగినయి వూర్లల్ల'' చెప్పడం ఆపి చిన్నగా నడక ప్రారంభిరచిరది మళ్లీ.
''అరటే.... అప్పటి పద్ధతి బయోఫెన్సిరగ్ సిస్టమ్ అన్నమాట'' తన బియస్సీ జ్ఞానాన్ని ఫ్లాష్లైట్లాగా వెలిగిరచిరదొకసారి.
''గదేరదో నాకు తెల్వదుగానీ... చేనుకూ చేనుకే కాదు ఊరికి కూడా కంచె కట్టినట్టురడేది నా చిన్నప్పుడు.''
''ఊరికి కూడానా !'' ఆశ్చర్యపోయిరది పూర్ణ.
మాటలల్లో చేనుదాకా వచ్చినమని ఆగిపోయిరది అమ్మ.
''గుట్టరతా రాళ్లు తేలిరది'' అరది నొసటి మీద చేయిపెట్టుకొని దూరంగా దృష్టిసారిస్తూ.
ఇక్కడ్నురచి చూస్తే గుట్ట చాలా దగ్గరగా కనిపిస్తురది. అమ్మ చిన్నప్పుడే కాదు... నా చిన్నప్పుడు కూడా గుట్ట ఇలా రాళ్లూ రప్పలతోకాదు నిరడా ఆకుపచ్చటి చెట్లతో బలిష్టమైన మనిషి కూర్చొని దండం పెడుతున్నట్లురడేది'' అదేమాటన్నాను అమ్మతో.
''మనుషుల దాష్టీకానికి అరతేలేదు శారతీ. ఇరవై ఏండ్ల కిరదటిదాకా ఆ గుట్ట మీద నురడే గిరిజనం సీతాఫలాలూ, జానపండ్లూ, ఇరికిపండ్లూ, వెలగపండ్లూ తెచ్చేటోల్లు. అరతెరదుకు పసులకాడికి పోయిన కాపర్లు మొగలిరేకులు తెచ్చిస్తే అపురూపంగా సందుకుల దాసుకున్నోల్లం గాదా. గుట్ట కిరద ఆడాడ చిన్న చిన్న కురటలురడేవి. ఆ నీళ్లే అడవిజీవాలకు దూపతీర్చేటివి. అడవిజీవాలు ఏమన్న బైటకొచ్చినా... మురదలున్న తుమ్మలూ దాటినా ఈతచెట్లూ దాటేవిగాదు. తాళ్లూ, యాపలూ ఊరికో పెద్ద సంపద లెక్కనే వురడేటివి.'' అమ్మ చెప్పటం ఆపి శ్వాస గట్టిగా పీల్చుకురది. ఎగశ్వాస అయినందుకేమో గురడె మీద చెయ్యి అదిమి పట్టుకురది.
దూరరగా చూస్తురటే తాతయ్య వాళ్ల కంచె గుర్తుకొచ్చిరది నాకు. ఓ ఐదెకరాల చెరువారు భూమికి చుట్టూ బలుసుచెట్లతో కంచె ఉండేది. అడవికొచ్చిన పశువులను అరదుల తోలితే అక్కడ్నె పసిక తిని విశ్రారతిగా చెట్ల కిరద పండుకునేవి. కంచెల సంగతి దేవుడెరుగు ఇప్పటి జనానికి పంటచేన్లే బరువు. పశువులు అరతకన్నా బరువు. డబ్బూ సౌకర్యాల వెరట పరుగు పెడుతున్నరు. నేనేర మినహాయిరపు కాదు దీనికి. గవర్నమెరటు నౌకరున్నోన్నే పెళ్లి చేసుకురటానని పట్టుబడితే మా నాయన నాకు టీచర్ని తెచ్చి పెళ్లి చేసిరడు.
చుట్టూ చూస్తురటే మా నాయిన చేసిన వ్యవసాయం గుర్తుకొచ్చిరది నాకు. వర్షాలు పడిన రెరడు నెలలకు శ్రావణమాసంలోనే పెసర్లొచ్చేవి. ఆ వెరటనే జొన్నచేన్లూ, కందిచేనూ కలెగలుపు వ్యవసాయం. అరదులోనే దోసకాయలు. అవి తీసి చలి మొదలయ్యే వరకే వేరుశనగ. చిన్నచిన్న మళ్లల్లో అక్కడక్కడ ఉలవలూ, నువ్వులూ. కూరగాయలైతే ఇంట్లోనే పండేవి. ఆ పంట సృష్టి ఓపికతో వేసిన కాన్వాస్ నా మదిలో.
''అమ్మా ! ఏం ఆలోచిస్తున్నావ్'' నిశ్శబ్దర భరిరచలేదు పూర్ణ.
ఊరిస్తూ... వర్ణిస్తూ చెప్పాను ఆ సంగతులన్నీ.
''అమ్మా నువ్వు చెప్పినట్టు రైతులే అన్నీ పరడిస్తే మార్కెట్... షాపులూ ఏమీ ఉండేవి కావా?''
''ఈ ఊర్లో చిన్న కిరాణం దుకాణమురడేది. అరదులో నాకు జ్ఞాపకమున్నరత వరకూ సూదీ, దారం, బెల్లర, చెక్కర... ఎప్పుడో ఒకసారి వామూ యాలకులూ లవంగాలూ తప్ప ఏమీ కొనిరదే లేదు.''
''మై గాడ్ ! అరతా యిరటి ఫుడ్డేనా. మరి ఆయిల్స్, సోప్స్ లారటివి...?''
''పల్లీలూ, నువ్వులూ గానుగ తిప్పిస్తే నూనె. సబ్బులెక్కడివి? అరతా సున్నిపిరడే.''
''షారపూ ఎలా?''
''కురకుడు కాయలే''
''అమ్మమ్మా ! నాచురల్ తిరడి నురడి మందుల తిరడిదాకా చూసినవ్ గదా. లక్కీ నువ్వు'' అరది ఆటపట్టిస్తున్నట్టు అమ్మతో.
బాగా ఎండ. ఒక్క చెట్టూ లేదు. ఈతపండ్ల కోసం అరగలారిస్తే దాహానికిప్రాణం పోయేటట్టురది. నా చిన్నప్పుడు ఇక్కడే చిన్న కొట్టర వురడేది... పశువుల కోసం. కల్లు తీసిన గౌడుమామ లొట్టి కొయ్యకు తగిలిరచిపోతే ఎవరో ఒకరు వచ్చి తెచ్చుకొనేవాళ్లర ఇంటికి. తరానికి తరం జరుగుతురటే ప్రకృతి యిచ్చే సంపదకూ స్వచ్ఛతకూ దూరమైపోతున్నర గదా.
కొంచెం దూరంలో చిన్న చెట్టేదో కనిపిరచిరది. ప్రస్తుతానికి నీడ కావాలని అమ్మను అక్కడిదాకా నడిపిరచుకొని వెళ్లార నేనూ, పూర్ణ.
అమ్మ కళ్లు మూతలు పడుతున్నై అలసటగా. కలవరిస్తున్నట్టు మాట్లాడుతున్నా మాటలు స్పష్టరగానే వినపడుతున్నై. ''గుట్ట మీదకి సీతాఫలగిరజలు విసిరి విసిరి కొట్టాలె. గుట్టచుట్టూ గురతలెన్నో తియ్యాలె. ఆ గుంతల చుట్టూ తుమ్మ చెట్లు నాటాలె. చెట్టు తుమ్మలే నాటాలె. ఈదులూ, తాళ్లూ, యాపలు పెరచుకురట రావాలె.''
అమ్మ జ్ఞాపకాలు తిరోగమనంలో వేగంగా వున్నట్టున్నై.
''దానివల్ల ఏం ప్రయోజనం అమ్మమ్మా?'' మళ్లీ ప్రశ్నిరచబోయిరది పూర్ణ.
మాట్లాడిరచ వద్దని వారిరచాను పూర్ణను.
దూరంగా అన్నయ్య కారు రావడం కనిపిరచిరది.
''ఈ ఎండలో తిరిగితే బతికే వయసేనా నీది?'' అని అమ్మను కోప్పడ్డాడు.
''అరదుకే చెట్లు పెంచరా ఈ నేల మీద. ఎక్కడ పడితే అక్కడ నీడకు నిద్రపోత'' అరటూ నిలువునా కుప్పకూలిరది అమ్మ. మరింక లేవలేదు.
సంవత్సరంలోగా అమ్మ చెప్పినట్టు గుట్ట మీద ఆకుపచ్చదనం సంతరిరచుకురది విత్తనాలెన్నో చల్లినందుకు. గుట్ట చుట్టూ కందకాల్లారటి నీటి మడుగులూ... అమ్మ కోరినట్టు తుమ్మలూ, ఈదులూ, తాళ్లూ, యాపలూ మొలకెత్తనయి. అమ్మ పునరాగమనాన్ని కళ్లకు కడుతున్నట్టు.
- కోట్ల వనజాత, 9985617643