పల్లవి : చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా తుంటరి నడకా తెలిసి అడుగేసినావే మాయంటీ 'బుల్లితెర' వెనుకా, ఆనందం అంగడి సరుకా కొనగలవా చెయ్యి జారక, సమయం ఎంత మిగిలిందమ్మా, 'ఛానల్స్' అన్నీ చూసేసాక!
కోరస్ : మొగుడింక చిలకా లేడింక...
చరణం-1 : చుట్టాల్ని తరిమేసి... చిన్నతెరను ప్రేమించావే! పెనిమిటిని వెలివేసి ఊహల్లో జీవించావే! పొదుపంతా కరిగించి ఆ విలువతో పెద్ద టీవీ కొన్నావే అతితెలివితో, కురిసే డైలీ సీరియల్స్ జడిలో, తడిసి తలనొప్పయ్యావే !
చరణం-2 : సమయాన్ని కొనగలిగే ధనముందా ఈ లోకంలో ? చదువు విలువెంతో మరిచావా 'స్టార్ మహిళ' మైకంలో, వినోదం ఇవ్వలేని ఆ టీవితో, అనాధగా మిగిలావే ఆగదిలో, కోరస్ : జనం అండ నీకు లేదింక... తీరా నువ్వు వెనక్కి తిరిగాక ఇల్లంతా ఖాళి ఇంకా !