Sun 08 Aug 00:19:31.476565 2021 పల్లవి : పకోడీ..ఓ.. పకోడీ.. పకోడీ..ఓ.. పకోడీ.. నీకై ఎంత మంది వేచి వేచి ఉన్నారో... ఈ చాయిటైమునడుగు అడుగు చెపుతుంది!! పకోడీ.. ఓ.. పకోడీ.. పకోడీ .. పకోడీ .. నీకై ఎంత ఎంత వేగి వేగి పోయిందో ఈ నూనెవేడినడుగు అడుగు ఇకనైనా..!! పకోడీ .. ఓ.. పకోడీ ..చరణం : ఉత్తరాదిన ఉల్లిధర పెరిగెతే... నీ పని ఉష్ కాకనుకున్నా .. చిరుఆశతో నినువేదీతే.. చిరుఆశతో నినువేడితే.. మా చేయి చిక్కెనని అనుకున్నా.. ఆ.. మార్కెటునే కుదిపేసినవి నీ ధరల హౌరులే .. ప్రతి ఇంట్లో.. వినిపించినవి.. ప్రతి ఇంట్లో.. వినిపించినవి.. మా నిట్టూరుపులే... !! (పకోడీ ..)చరణం : పాలకూరతో చేసిన పకోడలు.. పన్ను అంటితే కరిగి పోతాయి.. సొరకాయతో నిను వేసిన.. సొరకాయతో నిను వేసిన.. కడుపంతా నిండి పోతాయి.. ఆ.. నూనెలలో ఓలలాడినవి జీడిపప్పులే.. పల్లె సంతలలో ఘుమ్మెత్తినది.. పల్లె సంతలలో ఘుమ్మెత్తినది.. పకోడి వాసనే.. !! (పకోడీ ...) ''అక్బర్ సలీమ్ అనార్కలి'' (1979) చిత్రంలోని ''సిపాయీ...ఓ సిపాయీ'' పాటకు పేరడి. రచన సి.నారాయణరెడ్డి.- డా. బి.బాలకష్ణ9948997983 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి