Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బాలీవుడ్‌ కోహినూర్‌ ట్రాజెడీ కింగ్‌ దిలీప్‌కుమార్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

బాలీవుడ్‌ కోహినూర్‌ ట్రాజెడీ కింగ్‌ దిలీప్‌కుమార్‌

Sun 18 Jul 08:05:19.935033 2021

హమారే బాద్‌ ఇస్‌ మెహఫిల్‌ మే
అఫ్సానే బయా హౌంగే
బహారే హమ్‌కో ఢూండేంగే
నజానే హమ్‌ కహా హౌంగే
- దిలీప్‌ కుమార్‌
    భారతదేశపు నగరాలు, పట్టణాల్లోని కుర్రాళ్లు తమ నుదురుపై వెంట్రుకల్ని రింగులుగా తిప్పుకుని చిద్విలాసంగా పారూ కోసం, తమ ధన్నూ కోసం, అనార్కలీ కోసమో వీధులన్నీ కలియ తిరుగుతూ తమ విరిగిన సైకిల్‌నేమిటి, జేబులోని చివరి పావలాను కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడేవారు.
     అంతెందుకు? పార్వతి ఊరి వైపు వెళుతున్న ఎడ్లబండిలో కూర్చుని అంతిమ శ్వాస తీస్తున్న దేవదాసుతో బాటు వేలు, లక్షలాది కుర్రకారు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయే కాలం ఒకటుండేది.
    ఇదొక్కటేమిటి? దేశం దేశమంతా ఒకానొక సమయంలో తమ ప్రతి దు:ఖానికి విఫల ప్రేమకూ వియోగానికి, విషాదానికి, తమ ప్రేమకి కొలమానంగా ఒకే పేరు పెట్టేవారు. ఆ పేరు దిలీప్‌కుమార్‌.
- హెచ్‌.రమేష్‌బాబు, 77807 36386
     భారతీయ చలనచిత్ర రంగాన్ని టాకీలు వచ్చిన తొలి దశకంలో పృథ్వీరాజ్‌ కపూర్‌, బిల్లిమోరియా, కె.ఎల్‌.సైగల్‌, వి.శాంతారాం, చంద్రమోహన్‌, అశోక్‌ కుమార్‌ వంటి మహామహులు కథానాయకులై ఏలుతున్న కాలం అది. అప్పట్లో నటు లకు గానం వచ్చి ఉండటం అదనపు అర్హత. కాదు, తప్పని సరి. ఇలాంటి తరుణంలో నటనలో ఓనమాలు కూడా తెలియని ఓ కుర్రాడు సినిమాల్లోకి వచ్చి మహానటుడై నాలుగు తరాల నటు లకు నటనంటే ఏమిటో నేర్పి ఇండియన్‌ స్క్రీన్‌పై అర శతాబ్దానికిపైగా తనదైన మద్రవేశాడు. ఆ మహానటుడు దిలీప్‌కుమార్‌.
      దిలీప్‌కుమార్‌ భారతీయ సినిమా ప్రేక్షకులకు ఓ ట్రాజెడీకింగ్‌. మొత్తం సినీ పరిశ్రమతో 78 ఏండ్ల అనుబంధం కలిగి వున్న ఏకైక నటుడాయన. ఇక ఈ నెల 7న తన 99వ ఏట బొంబాయిలో దిలీప్‌కుమార్‌ కన్నుమూసి భారతీయులనందరినీ విషాదంలో ముంచెత్తారు. ఆయన మరణంతో సినీసీమలో ఒక తరం అంతరించిపోయినట్లైంది.
     దిలీప్‌కుమార్‌ పేరెత్తగానే అందాజ్‌, జోగన్‌, ఆర్జు, జుగ్నూ, కోహినూర్‌, మొఘల్‌ - ఏ - ఆజం వంటి ఒక 50 చిత్రాలు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తాయి. స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఆ తరువాత మరో 50 ఏండ్ల పాటు తనదైన అద్భుత నటనా వైదుష్యంతో వెండితెరను చకచ్ఛకితం చేసిన సహజ నటుడు దిలీప్‌కుమార్‌. సినిమా రంగంలో రాశి కన్నా వాసి ముఖ్యం అని నమ్మి కడవరకూ ఆచరించి ఉత్తమ చిత్రానికి, అత్యుత్తమ నటనకు తానొక నిర్వచనంగా చరిత్రకెక్కారాయన.
     అప్పటికే హిమాంశురారు కాలం చేసి (1940), దేవికారాణి ఆధిపత్యంలో బాంబే టాకీస్‌ సంస్థ నడుస్తున్న రోజులవి. అశోక్‌కుమార్‌ హీరోగా చిత్రాలు నిర్మిస్తున్నా, కొన్ని విభేదాలతో ఆయన తన బావ ఎస్‌.ముఖర్జీతో కలిసి బయటికి వచ్చి ఫిల్మిస్తాన్‌ సంస్థను నెలకొల్పుకుని విడిపోయారు. ఈ సమయంలో తమ సంస్థలో నటించేందుకు దేవికారాణి ఓ కొత్త హీరో కోసం అన్వేషిస్తున్నారు. దేవికారాణి భారతీయ చిత్ర రంగంలో తొలి తరం అందాల నాయిక. అప్పటికే ''అఛూత్‌ కన్య' 'నిర్మల' 'కంగన్‌' వంటి చిత్రాల్లో నటించిన స్టార్‌ హీరోయిన్‌, ప్రొడ్యూసర్‌.
     ఏదో తండ్రి చెప్పాడని పని మీద నైనిటాల్‌ వెళ్లిన దిలీప్‌ కుమార్‌ను తొలిసారిగా చూసిన దేవికారాణి ఆయన మృదుభాషణం, అమాయకపు దృక్కులను చూసి తాను తీయబోయే సినిమాకు హీరో ఇతనేనని నిర్ణయించు కున్నది. ఆ సినిమా 'జ్వార్‌ భటా'. అప్పటికి నటన అంటే అక్షరాలు కూడా తెలియని దిలీప్‌ కూడా జీవిక కోసం ఏదో ఒక పనిలో కుదిరి పోవాలను కుంటున్నాడు. కనుక స్క్రీన్‌ టెస్ట్‌ కోసం వెళ్లాడు. సెలక్టయ్యారు. అయినా అప్పటకీ ఆయనకు అడ్డంకులేవీ తొలగ లేదు. ఎందుకంటే ఆయనింకా 'దిలీప్‌ కుమార్‌'గా మారనే లేదు. అప్పటిదాకా అతనికి ఉన్న 'యూసుఫ్‌ ఖాన్‌' అన్న పేరు దేవికారాణికిష్టం లేదు. ఈ పేరు మార్చే పనిని తమ కంపెనీ రచయిత భగవతీచరణ్‌ వర్మకు అప్పగించింది. ఆయన ఆలోచించి దిలీప్‌ కుమార్‌ పేరు సూచించాడు. దేవికారాణి 'దిలీప్‌కుమార్‌'గా యూసుఫ్‌ ఖాన్‌కు నామకరణం చేసింది. మొదటి నుండీ అంతర్ముఖుడైన యూసుఫ్‌ఖాన్‌ - దిలీప్‌ కుమార్‌గా మారి ఆ తరువాత ఇండియన్‌ సినిమాలో సూపర్‌స్టార్‌గా ఎదిగారు.
     ఇదంతా దిలీప్‌కుమార్‌ పుట్టుక గురించి.. మరి యూసుఫ్‌ఖాన్‌ పుట్టుపుర్వోత్తరాల్లోకి వెళదాం. 1922 డిసెంబర్‌ 11న నేటి పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మధ్య తరగతి పఠాన్‌ల కుటుంబంలో పుట్టారు. తండ్రి గులాం సర్వర్‌ఖాన్‌.
      యూసుఫ్‌ తండ్రి గులాం సర్వర్‌ ఖాన్‌ది పండ్ల వ్యాపారం. పెషావర్‌లోనే గాకుండా బొంబాయిలో కూడా హౌల్‌సేల్‌ వ్యాపారం ఉండేది. ఈ పరిస్థితుల్లో యూసుఫ్‌ఖాన్‌ పెషావర్‌ లోని స్థానిక పాఠశాలలోనే ప్రాథమక విద్యాభ్యాసం జరిగింది. ఇంతలో వీరి పెద్దన్న అయూబ్‌ఖాన్‌కి ఆరోగ్యం బాగోలేక పోవడంతో చికిత్స కోసం బొంబాయికి వచ్చి అక్కడి నాగదేవి వీధిలో అద్దె ఇంట్లో దిగడంతో వారి బొంబాయి జీవితం మొదలైంది. తన అన్న ఆరోగ్యం మెరుగైన తరువాత అంతా కలిసి పెషావర్‌కి వెళ్లినా ఆ వెంటనే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1939లో తిరిగి బొంబాయికి వచ్చి స్థిరపడ్డారు. పూర్వపు వి.టి.స్టేషన్‌ దగ్గరలోని అంజుమన్‌ -ఎ- ఇస్లాం స్కూల్‌లో చేరిన యూసుఫ్‌ తన మెట్రిక్యులేషన్‌ పూర్తవగానే విల్సన్‌ కాలేజ్‌లో బిఎస్సీలో చేరిపోయాడు. మరో వైపు కాలేజ్‌లో చదువు కన్నా స్పోర్ట్స్‌లో ఆయనకు అసక్తి ఎక్కువగా ఉండేది. ఫుట్‌బాల్‌ ఇష్టంగా ఆడేవారు. ఇంకా ఎలాగైనా సరే జీవితంలో టెస్ట్‌ క్రికెటర్‌గా రాణించి తొలి సెంచరీ కొట్టాలన్నది ఆయన జీవితాశయం. కాని భవిష్యత్తులో జరిగింది వేరొకటి.
      చదువు సాగుతుండగానే ఒకనాడు తండ్రి పిలిచి తనకు వ్యాపారంలో పూర్తిగా తోడుండమని ఆడిగాడు. అంతే బిఎస్సీ మధ్యలో ఆపేసి పండ్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇంతలో పూణేలోని ఆర్మీ క్యాంప్‌లో 35 రూపాయల వేతనంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. కొద్దిరోజుల తరువాత క్యాంటీన్‌ మూసి వేయడంతో తిరిగి బాంబే వచ్చేశారు. మళ్లీ ఎప్పటిలా తండ్రి వ్యాపారంలో చేదోడుగా నిలిచాడు. హౌల్‌సేల్‌ బిజినెస్‌ కావడం వల్ల లావాదేవీల కోసం యూసుఫ్‌ఖాన్‌ బొంబాయి పరిసర పట్టణాలకు వెళ్లేవాడు. అలా ఒకసారి నైనిటాల్‌ వెళ్లినపుడు నటి దేవికారాణి కంట పడటంతో యూసుఫ్‌ జీవితం మలుపు తిరిగింది. ఆ తరువాత భారతీయ సినీ యవనికపై దిలీప్‌కుమార్‌గా అవతారమెత్తారు.
      ప్రతిష్టాత్మకంగా బాంబే టాకీస్‌ వారి 'జ్వార్‌ భటా' అమియా చక్రవర్తి డైరెక్షన్‌లో దిలీప్‌కుమార్‌ హీరోగా నటించారు. హీరోయిన్‌ మృదుల ఇంకా ఆగాజాన్‌, షమీమ్‌ తదితరులు నటించారు. 1944 నవంబరు 29న సినిమా విడులైంది కానీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తొలి బుక్కలోనే కంకెడు రాయి. తొలి అడుగే తడబడింది. రెండో చిత్రం 'ప్రతిమా' (1945) కూడా బాంబే టాకీస్‌ వారిదే. దర్శకుడు తెలంగాణ వాడైన పైడి జయరాజ్‌. 'ప్రతిమ' కూడా ఆడలేదు. ఫిల్మిండియా వంటి పత్రికలు ఈ సినిమాల గురించి తీవ్రమైన రివ్యూలు రాసినవి. మరో వైపు దేవికారాణి 1945 చివరలో బాంబే టాకీస్‌ను అమ్మేసి బెంగుళూరుకు వెళ్లిపోయింది. దిలీప్‌ కుమార్‌కు దిక్కుతోచలేదు. కానీ సంస్థలో ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా పని చేస్తున్న హితేన్‌ చౌధురి పర్యవేక్షక అధిపతి అయ్యాడు. ఆయన దిలీప్‌ని చాలా ఇష్టపడేవారు. ఫెయిల్యూర్‌తో ఉన్న దిలీప్‌ని నిలబెట్టడానికి ఠాగూర్‌ నవల 'నౌకా డూబి' ఆధారంగా నితిన్‌బోస్‌ దర్శకత్వంలో 'మిలన్‌'లో హీరోగా తీసుకున్నారు. 1946లో వచ్చిన 'మిలన్‌' కూడా పెద్దగా నడవలేదు. కానీ దిలీప్‌ కెరీర్‌లో మైలురాయి అన దగ్గ చిత్రంగా నిలిచిపోయింది.. నితిన్‌బోస్‌ నటుడిగా దిలీప్‌ను తీర్చిదిద్దాడు. నటనలో భావాల అభివ్యక్తీకరణ తీరుతెన్నులు ఎలా ఉండాలో క్షుణ్ణంగా బోధించాడు. ఆ సలహాలు, సూచనలను తన సినీ కెరీర్‌ మొత్తంలో అనుసరించారు దిలీప్‌కుమార్‌. అంతేగాకుండా 'మిలన్‌'లో దిలీప్‌ నటనను అప్పటి సినీ విమర్శకులు ఆకాశానికి ఎత్తేశారు. దీంతో ఆయన సినీ జీవితం మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.
      మిలన్‌ తరువాత షౌకత్‌ హుస్సేన్‌ రజ్వి నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన 'జుగ్ను' (1947) సూపర్‌ హిట్‌ అవడంతో దిలీప్‌కుమార్‌ విజయాల పరంపర మొదలైంది. ఈ చిత్రంలో కాలేజీ కుర్రవాడి వేషం దిలీప్‌కుమార్‌ది కాగా హీరోయిన్‌ నాటి ప్రసిద్ధ సింగింగ్‌ స్టార్‌ నూర్జహాన్‌. 'జుగ్ను'తో పెద్ద హిట్‌ చేజిక్కుంచుకున్నా ఆ వెంటనే మరో హిట్‌ దక్కలేదు. అయితే నౌషాద్‌ అలీ సిఫారసు చేయగా 'మేలా' (1948)లో అవకాశం వచ్చింది. హీరోయిన్‌ నర్గీస్‌. నౌషాద్‌ సంగీతంతో సినిమా పెద్ద హిట్‌. పాటలు దేశమంతా మారుమోగి పోయినవి. 'ఎ జిందగీకి మేలే' (రఫీ). 'ధర్తీ కో ఆకాశ్‌ పుకారే (ముఖేశ్‌ - పంషాద్‌) పాటలు పెద్ద హిట్‌ అయినవి. అతి పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ కావడంతో దిలీప్‌కుమార్‌ నాటి యువతరం మెచ్చే నటుడైపోయారు. ఆయన సంభాషణలు హావభావాలు, నటనలోని విలక్షణత ఇండియన్‌ సినిమాకు కొత్తదనాన్ని ఆపాదించినవి.
      పైలా పచ్చీస్‌ వయసులో వున్న దిలీప్‌కుమార్‌ యవ్వన స్ఫురద్రూపం ఒక్కసారిగా బాలీవుడ్‌ తెరపై స్టార్‌ హీరో శకాన్ని ప్రారంభించింది. ఒక లెజెండ్‌ హీరోగా తనను తాను రూపొందించుకోవడం మొదలుపెట్టారు దిలీప్‌. మేలా తరువాత ఆయన మరెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోనే లేదు. ప్రతి సినిమా ఒక చరిత్రను సృష్టించింది. ఒక్కో మైలు రాయిగా నిలిచిపోయిన మిలన్‌, షహీద్‌, నదియా కే పార్‌, జోగన్‌, హల్‌చల్‌, ఫుట్‌పాత్‌, సంగ్‌దిల్‌ అందాజ్‌, దీదార్‌, దాగ్‌ వరుసగా అన్నీ రొమాంటిక్‌ ట్రాజెడీలే. 'ట్రాజెడీ కింగ్‌' అన్న టైటిల్‌ ఆయన కీర్తి కిరీటంతో చేరిపోయింది.
      దిలీప్‌కుమార్‌ నటన ఏ చిత్రానికాచిత్రంలో వైవిధ్యం కనిపిస్తుంది. ఈ రకంగా మొత్తం మన దేశంలోనే మొట్టమొదటి మెథడ్‌యాక్టర్‌ దిలీప్‌కుమార్‌. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని తనను తాను ఆ పాత్రను ఆవహిస్తాడు. సంభాషణలు పలకడంతో ఆయనదొక శైలి. మాటలు లోగొంతుకలోంచి వస్తున్నట్లుగా స్పష్టతతో ముఖకవళికలను కలగలుపుతూ నటించడం ఆయన ప్రత్యేకత. నటుడుగా తాను కనిపించ కుండా పాత్రను తెరపై ఆవిష్కరిస్తూ గొంతులో నవరసాలను పలికించడం ఆయనకు మాత్రమే సాధ్యం. దిలీప్‌కుమార్‌ నటనలోని గొప్పతనం కూడా ఇదే. ఆ నటన ప్రేక్షకుడిని తన ఆధీనంలోకి తీసుకుం టుంది. ఆ పాత్రలు, సంభాషణలు ప్రేక్షకుడిని వెంటాడుతుంటాయి.
       దారి తప్పిన మనిషి అరాచక వాదిగా మారి చేసిన అకృత్యాలకు తనను తాను దోషిగా నిలబెట్టుకుని ''ఫుట్‌పాత్‌'' (1953)లో చెప్పే డైలాగ్‌ దిలీప్‌ నటనలోని పరిణితిని ఆవిష్కరిస్తుంది. ''నేను బ్లాక్‌ మార్కెట్‌ దందా చేశాను. జనం ఆకలితో అలమ టిస్తుంటే వారి తిండి గింజల్ని ఎక్కువ ధరకు అమ్మి డబ్బును పెట్టెల నిండా నింపుకున్నాం. రోగాలు ప్రబలు తుంటే మందుల్ని దాచి ఎక్కువ ధరకు అమ్మివేశాం. పోలీసులు దాడులు చేస్తారని తెలియగానే వాటిని మురికి కాలువల్లోకి పారవేశాం. నేను మనిషినే కాదు ఒక రక్త పిశాచాన్ని. నేను దాచిన మందులతో బతికేవాళ్ళంతా చనిపోయారు. మా అన్న కూడా చచ్చిపోయాడు. ఈ భూమి మీద గాలి పీల్చే అర్హత కూడా నాకు లేదు. మనిషిగా ఉండలేదు. నన్ను చంపేయండి'' అంటూ ప్రదర్శించే ఎమోషనల్‌ నటనలో మరొకరిని ఊహించలేము.
      దిలీప్‌కుమార్‌ను నటునిగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన చిత్రం ''దేవ్‌దాస్‌'' (1955). ఇది అత్యున్నత భారతీయ టాప్‌ 25 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. 1935లోనే న్యూ ధియేటర్స్‌ వారు కె.ఎల్‌.సైగల్‌లో హిందీలో దేవ్‌దాస్‌ తీశారు. అదొక తరం. ఆ తరంలో సైగల్‌దొక తరహా నటన గానాలతో భారతీయ ప్రేక్షకులకు ఓలలాడించాడు. కాని 1955 నాటికి సమాజంలో ఒక కొత్త తరం శరత్‌ దేవదాస్‌ను ఎలా చూడాలనుకున్నదో బిమాల్‌రారు అదేస్థాయిలో తీశాడు. దిలీప్‌కుమార్‌ దేవదాస్‌గా వీరవిహారం చేస్తాడు. సైగల్‌ని మరిపించాడు కూడా. హీరోయిన్లు సుచిత్రాసేన్‌, వైజయంతి, దర్శకుడు ఎవరూ కనిపించరు. దిలీప్‌ నటన తెర నిండా ఆక్రమించుకుపోయింది.
     'కౌన్‌ కంబఖ్త్‌ హై జో బర్దాష్‌ కర్నె కేలియే పీతా హూ
      మైతో పీతా హూంకి బస్‌ సాంస్‌ లే సకూఁ'
      దేవాదాస్‌కి జాతీయ స్థాయిలో మూడో ఉత్తమ చిత్రం అవార్డుతో బాటు దిలీప్‌కి ఉత్తమ నటునిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కింది. ''దేవదాస్‌'' చిత్రం దిలీప్‌ని ట్రాజెడీ కింగ్‌ను చేసింది.
      మరో వైపు వరుసగా విషాద పాత్రలు వేయడంతో దిలీప్‌ వ్యక్తిగతంగా కూడా డిప్రెషన్‌లోకి వెళ్లడం మొదలు పెట్టాడు. ఆయన పాత్రల ప్రభావం అంతలా ఉండేది. దాంతో డాక్టర్‌ సలహా మేరకు విషాద పాత్రలు మాని సరదా పాత్రలు వేయడం ప్రారంభించారు. ఆజాద్‌, నయాదేర్‌, మధుమతి, పైగామ్‌ వంటివి అలాంటి చిత్రాలే. అయితే దిలీప్‌కుమార్‌ చలన చిత్ర జైత్రయాత్రతో బాటు తన ప్రేమ యాత్రను కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. అసలు సినీ ప్రపంచంలో ప్రేమలో పడనివారెవరు? దిలీప్‌ అందుకు మినహాయింపేమి కాదు. దిలీప్‌ తొలిప్రేమ కామినీ కౌషల్‌తో నడిచింది. అప్పటికే ఆమె వివాహితురాలు. ఇంట్లో వారిని ఎదిరించి సినిమాల్లో నటించేది. ఆమె షహీద్‌ నదియాకే పార్‌, షబ్నం ఆర్జూ చిత్రాల్లో దిలీప్‌ కుమార్‌తో కలిసి నటించింది. ఇద్దరూ పీకల లోతుల్లో ప్రేమలో కూరుకుపోయారు. కామిని మిలటరీ సోదరుడు బెదిరించినా వినలేదు. చివరకు అతను పరువు కోసం ఆత్మహత్య చేసుకోవడం తో వీళ్ల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసి పోయింది.
      మేలా, అందాజ్‌, బాబుల్‌, జోగన్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నర్గీస్‌తో కొంతకాలం ప్రేమా యణం నడిచినా చివరికి మధుబాలతో ఆయన ప్రేమకథ బలంగా కొనసాగింది. అప్ప టికే ఆయన పెద్ద హీరోగా స్థిరపడిపోయారు. ఆయన రెమ్యునరేషన్‌ లక్షకు చేరింది. బాబుల్‌, తరానా, సంగ్‌దిల్‌ అమర్‌ వంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్లు. అంతేలాగ వీరి ప్రేమ కూడా. కానీ ఆమె తండ్రి తను తీసే చిత్రాల్లో దిలీప్‌ తప్పకుండా నటించాలనే నిబంధన పెట్టడంతో వ్యక్తిగతం, కెరీర్‌ రెండూ వేరుగా చూసే దిలీప్‌కు ఈ కండీషన్‌ నచ్చలేదు. మధుబాల ఎవరికీ చెప్పలేకపోయింది. నయాదౌర్‌లో కలిసి నటిస్తున్న సమయం అది. షూటింగ్‌ అంతా ఔట్‌డోర్‌లో. తండ్రి ససేమిరా అన్నాడు. నిర్మాత దర్శకుడు బి.ఆర్‌.చోప్రా కోర్టుకెక్కాడు. దిలీప్‌ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో మధుబాలకు కోర్టులో చుక్కెదురైంది. దాంతో వారి ప్రేమకథ అంతటితో ఆగిపోయింది. 'నయాదౌర్‌' లో మధుబాల స్థానంలో వైజయంతీమాల హీరోయిన్‌గా నటించింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే కె.ఏ.ఆసిఫ్‌ ప్రతిష్టాత్మకం గా తీస్తున్న 'మొఘల్‌ ఏ ఆజమ్‌' దిలీప్‌ మధుబాల హీరో హీరోయిన్లుగా షూటింగ్‌ మొదలైంది.
      మొఘల్‌ ఏ ఆజం భారతీయ సినీ తెరపై ఒక సిల్యులాయిడ్‌ కావ్యం. ముందుగా అక్బర్‌ వేషానికి తొలితరం నటుడు చంద్రమోహన్‌ని అనుకున్నారు. కానీ చివరికి పృథ్వీరాజ్‌ కపూర్‌ను ఫైనల్‌ చేశారు. దాంతో దిలీప్‌కుమార్‌ ఒక్కసారిగా సందిగ్ధంలో పడిపోయారు. భారీ డైలాగ్‌లు గాంభీరమైన నటనతో తెరనంతా పెద్దాయన ఆక్రమిస్తాడని అందుకు తను అండర్‌ ప్లేతో హావభావాలు బరువైన డైలాగుల్ని నెమ్మదిగా తనదైన ఒకనూతన శైలిలో పలుకుతూ నటించారు. అది తెరపై పండింది. ఇక మధుబాలతో అప్పటికే దిలీప్‌కి చెడింది. సెట్‌లో చెరో వైపు ముఖాలు తిప్పుకుని కూర్చునేవారు. షాట్‌ రెడీ కాగానే పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేవారు. ఇద్దరు విడిపోయిన ప్రేమికులు ప్రణయ సన్నివేశాల్లో అంత సజీవంగా నటించడం మరెవరికీ సాధ్యంకాదు. మొఘల్‌ ఏ ఆజం బ్లాక్‌బస్టర్‌ హిట్‌. విఫల ప్రేమికులు నటించిన ప్రణయ కావ్యంగా చరిత్రలోకెక్కిందీ చిత్రం.
      ఇంతలో తనకేదో సినిమా తీయాలనిపించి 'గంగా జమున' తీశారాయన. కానీ సెన్సార్‌ చిక్కుల్లో పడింది. లెక్కలేనన్ని కటింగ్స్‌తో అడ్డం పడ్డారు. ఆయన ఇమేజి సినిమా విడుదలకు పనికి రాలేదు. ఏకంగా అప్పటి ప్రధాని నెహ్రూ వద్దకెళ్లి ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోయింది. ఆ తరువాత మొరార్జీని కలువగా ఒక్క కట్‌ కూడా లేకుండా సినిమా విడుదలయ్యేలా చేశారు. ఈ అనుభం దృష్ట్యా ఆ తరువాత మరెప్పుడూ స్వంతంగా సినిమాలు తీయలేదు దిలీప్‌.
      గంగ జమున తరువాత 1976వరకు వరుసగా లీడర్‌, దిల్‌ దియా దర్ద్‌ లియా, పారీ, రాం ఔర్‌ శ్యాం, ఆద్మీ, సంఘర్ష్‌, గోపీ, దాస్తాన్‌, అనోఖాప్యార్‌, బైరాగ్‌ (1976) వరకు ఆయన హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఈ మధ్య కాలంలో షమ్మీ కపూర్‌, శశికపూర్‌, రాజేంద్ర కుమార్‌, మనోజ్‌ కుమార్‌, ధర్మేంద్ర, రాజేశ్‌ఖన్నా, అమితాబ్‌, జారు ముఖర్జీ ఒక్కరేమిటీ చాలా మంది హీరోలు ఇండిస్టీకి వచ్చినా దిలీప్‌ స్థానం, స్థాయి ఇంచు కూడా తగ్గలేదు. పైగా అందరూ దిలీప్‌లా నటించి రాణించాలని ఆయనను అనుకరించేవారే. ఇప్పటికీ అమితాబ్‌, అనీల్‌కపూర్‌, షారుఖ్‌ఖాన్‌ల వరకు ఆయన ప్రభావం కొనసాగింది.
      ఒకరంగా చెప్పాలంటే క్రాంతి (1981)తో ఆయన రెండో ఇన్నింగ్స్‌ మొదలైందనుకోవాలి. ఆ తరువాత విధాత, మజ్జార్‌, మషాల్‌, దునియా, కర్మ, సౌదాగర్‌ (1991) చిత్రాలు వయసు పైబడిన వేషాలు వేసినా వాటిల్లో ఆయనే హీరో.
      వీటిలో 'శక్తి' చిత్రం లో అమితాబ్‌ మరో హీరో. తండ్రి కొడుకులుగానూ నటించారు. అది మొఘల్‌ ఏ ఆజం నాటి పరిస్థితి. ఇప్పుడు పృధ్వీరాజ్‌ స్థానంలో దిలీప్‌, దిలీస్‌ స్థానంలో అమితాబ్‌ పోటీపడి అద్భుత నటనను పండించారు. ఆయన ఆఖరు చిత్రం ఖిలా (1998). ఆయన డైరెక్ట్‌ చేసిన ఏకైక చిత్రం. కళింగ ఏవేవో కారణాల వల్ల రిలీజ్‌ కాలేదు. 1944 నుండి 1998 వరకు ఆయన నటించిన చిత్రాలు 63కు మించవు. ఆయన తన నట జీవితంలో ఒకే సమయంలో ఒకే
      సినిమా అన్న నియామవళిని కడవరకు పాటించారు.
      దిలీప్‌కుమార్‌ నట జీవితంలో జాతీయ అవార్డులు కన్నా అధికంగా ఫిలింఫేర్‌ అవార్డులు అందు కున్నారు. జాతీయ అవార్డులపై ఆయనకు సదాబి ప్రాయం ఉండేది కాదు. 1991లో 'పద్మభూషణ్‌', 1995లో 'దాదాఫాల్కే పురస్కారం', 1998లో పాకిస్తాన్‌ ప్రభుత్వ నిషాన్‌ - ఏ ఇంతియాజ్‌, 2000లో రాజ్యసభ సభ్యుడిగా, 2015లో 'పద్మవిభూషణ్‌' పురస్కారాలు ఆయనను వరించి తమ గౌరవాన్ని పెంచుకున్నవి. రాజకీయ కారణాల వల్ల 'భారతరత్న' రాకపోయినా భారతీయుల హృదయాలలో ఆయన స్థానం అంతకు మించినదే. సత్యజిత్‌రే వంటి మహా దర్శకుడు దిలీప్‌ కుమార్‌ నటనకు నిలు వెత్తు రూపం అని ప్రశంసించారు.
      హృదయ గతమైన, సున్నిత సుమకోమలమైన ద్వారాలను తాకగలిగే రొమాంటిక్‌, ట్రాజెడీ పాత్రల పోషణలో దిలీప్‌ కుమార్‌ అగ్రగణ్యుడని పలువురు సినీ విమర్శకుల అభిప్రాయం. అందుకే బాలీవుడ్‌లో నటన జీవించిన కాలం పేరు దిలీప్‌కుమార్‌.
      దిలీప్‌కుమార్‌ తెరపై మానవ సహజ భావనలకు నటనా రూపమిచ్చిన వాడు. అతను నటుడిగా జీవించడానికే పుట్టిన వాడు. ఆయన తన కర్తవ్యం పూర్తవగానే నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన బాలీవుడ్‌ ఆఖరి మొఘల్‌.
      ఓ దూర్‌ కే ముసాఫిర్‌
      హమ్‌ కో భి సాథ్‌ లేలే రే
      హమ్‌ కో భి సాథ్‌ లే లే
      హమ్‌ రహెగయే అకేలే!
బాలీవుడ్‌ హీరో త్రయం - విఫల ప్రేమలు
      బాలీవుడ్‌ను తిరుగులేని కథా నాయకులుగా ఏలినది ముగ్గురే ముగ్గురు దిలీప్‌కుమార్‌, రాజ్‌కపూర్‌, దేవానంద్‌. వీరిలో రాజ్‌కపూర్‌ సీనియర్‌. అయినప్పటికీ హీరోగా తొలుత నటిచింది దిలీప్‌కుమార్‌. ఆ తరువాత 1946లో దేవానంద్‌ 'హమ్‌ ఏక్‌హై'తో హీరో అయితే, 1947లో 'నీల్‌ కమల్‌' లో రాజ్‌కపూర్‌ హీరోగా తొలుత నటించాడు. దిలీప్‌ ట్రాజెడీలు చేస్తే, దేవ్‌ రొమాంటిక్‌ రోల్స్‌, రాజ్‌కపూర్‌ షోమన్‌ గా రాణించారు.
      దేవానంద్‌, రాజ్‌కపూర్‌లు దిలీప్‌కుమార్‌తో కలిసి నటించి వారి మధ్య స్నేహపూర్వకం వాతావరణం ఉందని చెప్పకనే చెప్పారు. 1949లో మెహబూబ్‌ఖాన్‌ 'అందాజ్‌'లో రాజ్‌ - దిలీప్‌లు హీరోలు. నర్గీస్‌ నాయిక. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. ఇందులో దిలీప్‌ది ట్రాజిక్‌ హీరో పాత్ర. సినిమాలో మార్కులు మొత్తం కొట్టేశాడు. మళ్లీ దిలీప్‌ రాజ్‌లు కలిసి నటించనే లేదు. నిజానికి వాళ్లిద్దరు పెషావర్‌ నాటి నుంచి బాల్య స్నేహితులు. ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. కానీ వృత్తి విషయానికి వచ్చినపుడు ఎవరి జాగ్రత్తల్లో వారున్నారు.
      దిలీప్‌కుమార్‌ నటుడిగా తన టాలెంట్‌ను తన బలమైన ముద్రతో ఆవిష్కరిస్తాడు. అందాజ్‌లో అదే జరిగింది. 'దీదార్‌'లో కూడా అశోక్‌ కుమార్‌ నటన దిలీప్‌ ముందు దూదిపింజలా తేలిపోయింది. ఇక దిలీప్‌ - దేవానంద్‌లు కలిసి నటించిన ఏకైక చిత్రం 'ఇన్సానియత్‌' (1955). ఇది పల్లెటూరి పిల్ల (1951) తెలుగు చిత్రానికి రీమేక్‌. తెలుగులో ఎన్టీఆర్‌ చేసిన రోల్‌ దేవ్‌, దిలీప్‌ - అక్కినేని పాత్రను పోషించారు. మళ్లీ దేవ్‌ - దిలీప్‌ కలిసి నటించలేదు. ఏది ఏమైనా ముగ్గురూ ఒకరి నీడలు మరొకరిపై పడకుండానే వారి కెరీర్‌ను సాగించారు. ఐతే విచిత్రంగా ముగ్గురూ తమ ప్రేమల్లో విఫలమైనారు. దిలీప్‌కుమార్‌కి అన్ని కలిసి వచ్చినా మధుబాల ప్రేమను ఆమె తండ్రి జోక్యంతో త్యాగం చేయవలసి వచ్చింది. చివరికి తన వయసులో సగం ఉన్న సైరాబానుని పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత హైదరాబాదుకు చెందిన సైరా ఆస్మాన్‌ను 1980లో దిలీప్‌ పెళ్లి చేసుకున్నాడు. కానీ సైరాబాను ఒప్పుకోలేదు. పెద్దల జోక్యంతో 1983లో సైరాకు విడాకులు ఇచ్చేశాడు.
తెలుగు సినిమాలతో అనుబంధం..
      దిలీప్‌కుమార్‌కు దక్షిణ భారత సినిమా రంగంతో సన్నిహిత సంబంధాలుండేవి. పక్షిరాజా శ్రీరాములు నాయుడు 'ఆజాద్‌' చిత్రం దిలీప్‌తోనే తీశారు. హీరోయిన్‌ భానుమతి. డి.రామానాయుడు 'రాముడు - భీముడు'ని విజయా వారు హిందీలో దిలీప్‌ - రామ్‌ ఔర్‌ శ్యామ్‌ గా తీశారు. జెమినీ వారు 'ఇన్సానియత్‌' 'పైగాం' చిత్రాలలో ఆయనే హీరో. ఎన్టీఆర్‌ ఏఎన్నార్‌లతో ఆయనకు దగ్గర స్నేహం ఉండేది. అక్కినేని తెలుగులో నటించిన 'కలెక్టర్‌ గారబ్బాయి'ని హిందీలో 'కానూన్‌ ఆప్నా ఆప్నా' గా హిందీలో ఆయనే చేశారు. 'బొబ్బిలి బ్రహ్మన్న' హిందీ వెర్షన్‌ 'ధరమ్‌ అధికారి'గా ఆయనే నటించారు. దక్షిణ భారత దేశంలో స్టూడియో నిర్వహణ తీరుతెన్నులను, ఇక్కడి పనితనాన్ని చాలా ఇష్టపడే వారాయన. తాను దేవదాసులో నటించాక ఎవరో చెప్పగా అక్కినేని 'దేవదాసు' చూసి ఒకవేళ ముందుగా ఈ చిత్రాన్ని చూసి ఉంటే నా నటన మరోలా ఉండేదన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:04 PM

సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..

09:53 PM

చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

09:42 PM

తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన

09:38 PM

శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

09:30 PM

నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి

09:20 PM

అమ‌లాపురం అల్లర్ల ఘటన.. వాట్సాప్ మెసేజ్ గుర్తింపు..!

09:08 PM

పంజాబ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహితలకు రాజ్యసభ సీటు..!

09:01 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

08:57 PM

మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఇద్దరికీ పెండ్లి చేసిన గ్రామస్తులు

08:45 PM

పిచ్చోడి చేతిలో రాయిలా.. బండి సంజయ్ చేతిలో బీజేపీ : వైఎస్ షర్మిల

08:40 PM

అనుమానాస్పదంగా టీఆర్ఎస్ యువ నాయకుడు మృతి

08:26 PM

పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు

08:20 PM

ఆర్టీసీతో ఎన్టీఆర్ అనుబంధాలను గుర్తు చేసుకున్న సజ్జనార్

08:02 PM

ఎన్టీఆర్‌కు ఎదురెళ్లడం నా దురదృష్టకరం : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు

07:55 PM

దేశంలో పెరుగుతున్న బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.